హిందూ పంచాగం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో పరివర్తనం చెందుతుంటుంది. దీపావళి తరువాత కొన్ని రాశులపై జాతకంపై బుధ గోచారం ప్రభావం చూపించనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందా..
అక్టోబర్ 26వ తేదీన అంటే సరిగ్గా దీపావళి మరుసటి రోజు బుధుడు తులారాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా అన్నిరాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడనుంది. కొన్ని రాశులకు మాత్రం శుభ సూచకం కానుంది. వ్యాపార, ఆర్ధిక వ్యవహారాల్లో ఊహించని వృద్ధి కన్పిస్తుంది.
మకరరాశి
మకరరాశిపై బుధుడి తులారాశి ప్రవేశం సంతోషాల్ని తెస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఊహించని మార్గాల్నించి ధనం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆఫీసు పనుల నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబసభ్యుల సంబంధాలు బాగుంటాయి.
ధనస్సురాశి
ధనస్సురాశివారికి ఆర్ధికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త డీల్స్ చేస్తారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడి లాభాల్ని ఆర్జిస్తుంది. ప్రేమ సంబంధ వ్యవహారాల్లో భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. రాజకీయరంగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
తులరాశి
బుధుడి తులారాశి ప్రవేశం కుంభరాశి జాతకులకు శుభసూచకంగా ఉంటుంది. ఈ జాతకంవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌పరంగా ఉన్నత శిఖరాల్ని చేరుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు విజయం లభిస్తుంది.
కన్యారాశి
ఇక చివరిగా బుధుడి పరివర్తనం ప్రభావం కన్యారాశిపై ఊహించని మార్పులకు కారణమౌతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు అంతా అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.
Also read: Solar Eclipse 2022: సూర్యగ్రహణం సమయంలో గ్రహాల కలయిక.. ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook