Mercury Retrograde 2023 effect: మెర్క్యూరీని గ్రహాలు రాకుమారుడు, గ్రహాల యువరాజు అని పిలుస్తారు. ఇతడి స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న బుధుడు ఏప్రిల్ 21న అదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు . బుధ వక్రీ కారణంగా ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
సింహ రాశి: బుధ వక్రీ కారణంగా సింహ రాశి వారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. మీరు కెరీర్ లో మంచి విజయం సాధిస్తారు.విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం: బుధగ్రహం యొక్క తిరోగమన ప్రభావం కుంభరాశి వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీరు కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.
మీనం: బుధుడు తిరోగమనం మీన రాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో మంచి విజయాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారికి విదేశాల నుంచి లాభం ఉంటుంది. ఇతరులతో పరిచయాల వల్ల మీకు ప్రయోజన ఉంటుంది.
Also Read: Guru Rahu yuti 2023: రాబోయే 7 నెలలు ఈ 4 రాశులకు కష్టాలు.. ఇందులో మీరున్నారా?
మేషం: బుధుడు తిరోగమనం మేష రాశి వారికి కలిసి వస్తుంది. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. మీకు కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. డబ్బును పొదుపు చేస్తారు. ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది.
మిథునరాశి: తిరోగమన బుధుడు మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ కెరీర్ అద్బుతంగా ఉంటుంది. ఆఫీసులో మీ ఇమేజ్ పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడతుంది.
Also Read: Surya Rahu Yuti 2023: 72 గంటల తర్వాత డేంజరస్ యోగం.. ఈ 4 రాశుల జీవితం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి