Mercury Retrograde In Telugu: ప్రతి గ్రహం ప్రత్యేక సమయంలో రాశులు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సూర్య, బుధ గ్రహాలు సంచారం చేయడం చాలా శుభప్రదం. అయితే ఎంతో ప్రత్యేకత కలిగిన బుధుడు తిరోగమనం చేయబోతోంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న ఈ గ్రహం ఏప్రిల్ 19న తిరోగమన దశలో కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ సమయంలో జాతకంలో బుధ గ్రహం ప్రత్యేకమైన శుభ స్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే బుధుడు తిరోగమనం చేయడం వల్ల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
ఈ రాశులవారిపై బుధుడి తిరోగమనం ఎఫెక్ట్:
ధనుస్సు:
మీన రాశిలో బుధుడు చేసే తిరోగమనం కారణంగా ధనుస్సు రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరి ఆర్థిక జీవితంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఖర్చులు విపరీతంగా పెరిగి ఆర్థింగా దెబ్బతినే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామితో విభేదాలు కూడా రావచ్చు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
మిథునరాశి:
మిథున రాశివారిపై కూడా బుధుడి తిరోగమనం ఎఫెక్ట్ పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. దీంతో పాటు ఉద్యోగం చేస్తున్నవారికి సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో మంచిది.
బుధగ్రహానికి ప్రత్యేక పరిహారాలు:
జాతకంలో బుధ గ్రహాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి రోజు ఉదయం పూట ఓం బం బుధాయ నమః అనే మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాయంత్ర పూట ఓం ఐం శ్రీం శ్రీం బుధాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల బుధుడు బలపడే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ప్రతి బుధవారం రోజు ఆవుకు ఆహారాలు ఇవ్వడం చాలా మంచిది. దీంతో పాటు దాన, ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి