Mercury Retrograde 2023: బుధుడి తిరోగమనంతో ఈ రోజు నుంచి నెల పాటు ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే!

Mercury Retrograde 2023 August: బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సులభంగా అనుకున్న పనులు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2023, 09:34 AM IST
Mercury Retrograde 2023: బుధుడి తిరోగమనంతో ఈ రోజు నుంచి నెల పాటు ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే!

 

Mercury Retrograde 2023 August: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని మేధస్సు, తార్కిక ఆలోచన, కమ్యూనికేషన్‌నికి కారకంగా భావిస్తారు. అంతే కాకుండా ఈ గ్రహాన్ని కన్య, మిథున రాశికి కారకంగా కూడా చెప్పుకుంటారు. ప్రతి గ్రహం లాగే బుధ గ్రహం కూడా సంచారం చేస్తుంది. అయితే బుధుడు 24 ఆగస్టు 2023, 00:52కి సింహరాశిలో తిరోగమనంలో చేశాడు. దీంతో ఈ తిరోగమన ప్రభావం అన్ని రాశులవారిపై పడింది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మీకు తెలియజేయబోతున్నాం..

ఈ 3 రాశులవారి జీవితాలు మారబోతున్నాయి:
మిథున రాశి:

బుధ తిరోగమనం కారణంగా మిథున రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మిథున రాశివారి అదృష్టం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నవారికి ఈ సమయంలో ఊహించని ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో భౌతిక సుఖం కూడా రెట్టింపు అవుతుంది. సమస్యలతో చిక్కుకుపోయిన వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా స్నేహితుల మద్ధతు లభించి అన్ని రకాల పనులు చేయగలుగుతారు.

Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  

వృశ్చిక రాశి:
బుధుడి తిరోగమనం కారణంగా వృశ్చిక రాశివారికి కూడా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో సమాజంలో మంచి గుర్తింపు లభించి, ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ తిరోగమనం కారణంగా వృశ్చిక రాశివారి విశ్వాసం పెరిగి..సులభంగా అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. 

కన్యారాశి:
కన్యారాశి వారిపై కూడా బుధుడి తిరోగమన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలిగే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి వృత్తిలో పురోగతి లభించి..ఆదాయం రెట్టింపు కూడా కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.  ఆర్థిక శ్రేయస్సులో పెరుగుదల కారణంగా ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News