Mars Transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహానికి అమితైన మహత్యముంది. ఈ గ్రహాన్ని సాహసం, శౌర్యం, భూమి, పెళ్లి అంశాలకు కారకుడిగా భావిస్తారు. మంగళ గ్రహం శుభస్థితిలో ఉంటే ఆ జాతకులకు అంతా అనుకూలంగా ఉంటుంది. మంగళ గ్రహం గోచారంతో తుల రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా మంగళ కేతు యుతి ఏర్పడనుంది.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ అక్టోబర్ 3న మంగళ గ్రహం తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో అప్పటికే ఉన్న కేతువుతో కలిసి మంగళ-కేతు యుతి ఏర్పడనుంది. రెండు శక్తివంతమైన గ్రహాలు మంగళ, కేతువు కలయికతో 12 రాశులపై ప్రభావం పడనుంది. ఇందులో 3 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఈ రాశివారికి గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే చెప్పవచ్చు. ఊహించని విధంగా ధన సంపదలు వచ్చి పడతాయంటారు.
మంగళ కేతు గ్రహాల కలయికతో ఏర్పడే యుతి కారణంగా తులా రాశి జాతకులకు అంతా శుభం కలగనుంది. ఈ రాశి జాతకులకు చాలా సానుకూలంగా ఉంటుంది. కష్టమనుకున్న పనులు ఒకదానివెంట మరొకటి పరిష్కారమౌతాయి. కెరీర్ అభివృద్ధి పధంలో ఉంటుంది. కీలకమైన పదవితో పాటు మంచి జీతభత్యాలు దక్కుతాయి. కొత్త పనులు ప్రారంభించవచ్చు. సంపద కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త మంచిది. నిర్లక్ష్యంలో ఉంటే సమస్యలు ఎదురుకావచ్చు.
మంగళ కేతు గ్రహాల యుతి కారణంగా కుంభ రాశి జాతకులకు అదృష్టం తోడుగా నిలుస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ఎక్కడైనా చిక్కుకున్న డబ్బులు చేతికి అందుతాయి. ఫలితంగా ఆర్దికంగా చాలా ఉపశమనం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయగలరు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విజయం మీకు దక్కుతుంది. పెండింగులో పనులు పూర్తవుతాయి.
కన్యా రాశి జాతకులకు ఈ సమయం గోల్డెన్ డేస్ కంటే తక్కువేమీ కాదు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. మీడియా, విద్య, మార్కెటింగ్, క్రియేటివ్ రంగాల్లో ఉండేవారికి అమితమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఎదురౌతాయి. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. పదోన్నతితో పాటు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Also read: Rahu Ketu Transit 2023: రాహు కేతువులతో ధనలాభం కూడా ఉంటుందా, ఆ రాశి వారి పరిస్థితేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook