Mars Transit 2023: మంగళ గ్రహం గోచార ప్రభావం.. ఈ 5 రాశుల జీవితాల్లో 69 రోజులు తిరుగుండదు

Mars Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం వివిధ గ్రహాలు వేర్వేరు సమయాల్లో గోచారం చేస్తుంటాయి. గ్రహాల గోచారం అన్ని రాశులపై ఉంటుంది. అదే విధంగా మంగళ గ్రహం గోచారం ప్రభావం ప్రత్యేకంగా 5 రాశులపై ఊహించనివిధంగా ఉండనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 10:21 AM IST
Mars Transit 2023: మంగళ గ్రహం గోచార ప్రభావం.. ఈ 5 రాశుల జీవితాల్లో 69 రోజులు తిరుగుండదు

Mars Transit 2023: జ్యోతిష్యం ప్రకారం మార్చ్ 13 వతేదీన మంగళ గ్రహం మిధున రాశిలో ప్రవేశించాడు. మంగళ గ్రహం గోచారం వల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నా.. కొన్ని రాశులపై మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. 5 రాశుల జాతకులకు 69 రోజుల వరకూ ఊహించని లాభాలు కలగనున్నాయి.

హిందూ పంచాగం ప్రకారం మంగళ గ్రహాన్ని సాహసం, ఆత్మ విశ్వాసం, పరాక్రమానికి కారకుడిగా భావిస్తారు. మార్చ్ 13న మంగళ గ్రహం గోచారం కారణంగా కొన్ని రాశులకు ప్రతికూలంగా, కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటోంది.

మంగళ గ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఏయే రాశులపై..?

మకర రాశి

జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం గోచారం ఈ రాశివారికి ఆరోగ్యం దృష్ట్యా లాభదాయకం. ఈ సమయంలో ప్రత్యర్ధులు ఓటమి అంగీకరించి మిత్రులుగా మారిపోతారు. ఈ సమయంలో ఏదైనా పొరపాటు లేదా తప్పు చేస్తే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు చాలా అనువుగా ఉంటుంది. 

సింహ రాశి

జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం మిథునరాశిలో ప్రవేశించడం వల్ల సింహరాశి జాతకుల జీవితంలో కీలకమార్పు ఉంటుంది. ఈ సమయంలో ఈ జాతకులు సంసారంలో అన్ని సుఖాల్ని అనుభవిస్తారు. ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా..పెట్టుబడులపై లాభాలు ఆర్జిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్ధికంగా ఏ సమస్యగా ఉండదు.

మీన రాశి

మంగళ గ్రహం గోచారం ఈ రాశివారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి జాతకుల కుటుంబం, మిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

తులా రాశి

మంగళ గ్రహం మిథున రాశిలో గోచారం వల్ల ఈ రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారి మనస్సు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉంటుంది. సుదీర్ఘ తీర్ధయాత్రకు వెళ్లవచ్చు. ఈ సమయంలో ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా జరుగుతుంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఏ పనైనా ప్రారంభించాలి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 

కన్యా రాశి

జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం గోచారం ప్రభావం ఈ రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా, శక్తివంతంగా ఉండనుంది. పనిచేసేచోట కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తుంటే..మంచి లాభాలు ఆర్జిస్తారు. తల్లి ఆశీర్వాదంతో జీవితంలో ప్రతి అడుగులో విజయం లభిస్తుంది.

Also Read: Hindu New Year 2023: మరో మూడ్రోజుల్లో కొత్త ఏడాది ఉగాది ప్రారంభం, ఈ రాశుల జీవితం సూర్యుడిలా మెరిసిపోతుందా

Also Read: MLC Kavitha ED Investigation: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరౌతారా లేదా, ఏమౌతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News