Mangal Gochar 2023: మంగళ మార్గి ఎఫెక్ట్... కొత్త ఏడాదిలో ఈ 3 రాశులకు తిరుగుండదు..

Mangal Gochar 2023: కొత్త సంవత్సరం ప్రారంభంలో అంగారక గ్రహం తిరోగమనం నుండి మార్గంలోకి రానుంది. దీంతో మూడు రాశులవారికి సమాజంలో గౌరవం పెరగడంతోపాటు సంపద వృద్ధి చెందుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 10:00 AM IST
Mangal Gochar 2023: మంగళ మార్గి ఎఫెక్ట్... కొత్త ఏడాదిలో ఈ 3 రాశులకు తిరుగుండదు..

Mangal Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారుకుడిని గ్రహాల కమాండర్ గా భావిస్తారు. ఇతడిని రెడ్ ఫ్లానెట్ గా భావిస్తారు. ధైర్యం, శక్తి, భూమి మరియు వివాహానికి కుజుడిని కారకుడిగా భావిస్తారు. నవంబర్ 13, 2022న రాత్రి 8.38 గంటలకు కుజుడు తిరోగమన స్థితిలో వృషభరాశిలోకి ప్రవేశించాడు. మళ్లీ అంగారుకుడు ఈనెల 13న వృషభరాశిలో మార్గంలోకి రానున్నాడు. 

కుజుడి కదలిక వల్ల సమాజంలో మీకు గౌరవం, సంపద, పురోభివృద్ధి లభిస్తాయి. ఎవరి జాతకంలో మార్స్ చెడు స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక కష్టాలను ఎదుర్కొంటారు. ఎవరి కుండలిలో కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. అంగారకుడి మార్గం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. 

సింహ రాశి (Leo): కుజుడు మీకు కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగాన్ని ఇస్తాడు. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీరు ప్రతి పనిలోనూ అనుకున్న విజయాలను సాధిస్తారు. 

కన్య (Virgo): అంగారుకిడి ప్రత్యక్ష సంచారం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. 

కర్కాటకం (Cancer): మీ జాతకంలో 11వ ఇంట్లో కుజుడు పరివర్తన చెందబోతున్నాడు. దీంతో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడి లాభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Vaikunta Ekadasi 2023: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి...ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News