మంగళం అంటేనే శుభం అని అర్ధం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం గోచారం చేసినప్పుడు చాలా రాశుల జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వచ్చే నెల అంటే మార్చ్ 13వ తేదీన మిథున రాశిలో మంగళ గ్రహం గోచారం జరగనుంది. ఈ గోచారం కారణంగా కొన్ని రాశులవారికి హోలీ తరువాత ఇంట్లో కనకవర్షం కురవనుంది.
మంగళ గోచారంతో ఏ రాశులకు దశ తిరగనుంది
వృషభరాశి
ఈ రాశి జాతకులు తమ జీవిత భాగస్వామితో కలిసి సంపద కూడబెట్టడంలో సఫలీకృతులౌతారు. తల్లిదండ్రులు, గురువుల నుంచి సంపూర్ణమైన సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ముందుకు రాణిస్తారు. టెక్నాలజీ శిక్ష అభ్యశిస్తున్న విద్యార్ధులకు మంగళ గ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ధ్యాస అవసరం. శుభ కార్యక్రమాల కోసం దుర్గాదేవిని పూజించాలి.
సింహరాశి
మంగళ గ్రహ గోచారంతో ఈ రాశి జాతకులకు హోలీ తరువాత అద్భుతమైన ధనలాభం కలిగే అవకాశముంది. జీతం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల్నించి ఊహించని ధనలాభం కలగవచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం కోసం ఆలోచిస్తుంటే మంగళ గ్రహం గోచారం అత్యుత్తమం కానుంది. కోర్టు వ్యవహారాల్లో కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. మంగళ గ్రహాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి మంగళవారం నాడు భజరంగ బలిని పూజించాలి.
మకర రాశి
ఈ రాశివారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పని నిమిత్తం విదేశాలకు వెళ్తారు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఆదాయం కూడా పెరగడంతో ఖర్చు సమస్యగా అన్పించదు. ప్రత్యర్ధులు మిమ్మల్ని అనవసరపు వివాదాల్లో లాగేందుకు ప్రయత్నిస్తారు. శాంతంగా ఉండి ఆ మాటల్ని పట్టించుకోవద్దు. మంగళ గ్రహం గోచారం శుభ ఫలాలు అందుకునేందుకు రోజూ బెల్లం తినాల్సి ఉంటుంది.
మీన రాశి
మంగళ గ్రహం రాశి పరివర్తనం లేదా గోచారం కారణంగా మీనరాశి జాతకులు కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లు కొనవచ్చు. తండ్రి తరపు ఆస్థి లాభిస్తుంది. కుటుంబ సహకారం పూర్తిగా లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి అనుకూలమైన సమయం. కుటుంబ జీవితంలో ముందుకు రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో ఈ రాశివారు ఆవేశంగా ఉండటం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
Also read: Sun Transit 2023: శని రాశిలోకి సూర్యుడు.. ఇవాల్టి నుండి ఈ రాశుల జీవితంలో అల్లకల్లోలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook