Chandra Grahan 2023 Date time in India: సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. హిందు గ్రంధాలలో గ్రహణాన్ని అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడినప్పుడల్లా, దాని సూతక కాలం కొన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సూతక్ కాల లేదా గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు, పూజలు లేదా ముఖ్యమైన పనులు చేయరు. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఈ సంవత్సరం రెండో లేదా చివరి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందో తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఎప్పుడు?
2023లో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం అశ్వినీ అమవాస్య రోజు ఏర్పడబోతుంది. ఇది అక్టోబర 28నాడు రాత్రి 1:06 గంటలకు ప్రారంభమై 2:22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం వ్యవధి 1 గంట 16 నిమిషాలు. ఇప్పుడు ఏర్పడబోయేది పాక్షిక చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించనుంది. దీని సూతక్ కాలం కూడా చెల్లుతుంది. చంద్రగ్రహణం యొక్క సూతక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.
Also Read: Budh Asta 2023 Date: బుధుడి అస్తమయంతో మారిన ఈ రాశుల అదృష్టం, ఇక వీరికి తిరుగుండదు..
మన దేశంలో కనిపిస్తుందా?
ఈ గ్రహణం భారతదేశంతోపాటు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం మరియు ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇది గ్రహణం మెుత్తం 12 రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. ఈ చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ప్రయాణాలు చేయకండి. ఇంట్లో పూజ గదితలుపులు మూసి ఉంచండి. గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోండి.
Also Read: Mars transit 2023: సూర్యుని రాశిలోకి కుజుడు... ఈ 4 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook