Lunar Eclipse 2023: సూర్య, చంద్ర గ్రహాల ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలుండగా రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రెండు గ్రహణాలు మిగిలున్నాయి. ఇందులో చివరి రెండవ చంద్ర గ్రహణం మరి కొద్దిరోజుల్లోనే ఉంది. ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
2023 సంవత్సరపు చివరి , రెండవ చంద్ర గ్రహణం మరి కొద్దిరోజుల్లో ఏర్పడనుంది. 2023లో ఇండియాలో కన్పించే ఏకైక గ్రహణం ఇదే కావడం విశేషం. అందుకే ఈ గ్రహణం ప్రభావం గట్టిగా ఉంటుంది. అదే సమయంలో సూతకకాలం కూడా వర్తిస్తుంది. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలుండగా ఒక సూర్య గ్రహణం, ఒక చంద్ర గ్రహణం ఇప్పటికే ముగిశాయి. మరో చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం రెండూ అక్టోబర్ నెలలోనే ఉన్నాయి. అక్టోబర్ 14న సూర్య గ్రహణం ఏర్పడనుండగా, అక్టోబర్ 28వ తేదీన చంద్ర గ్రహణం ఉంది. ఇండియాలో కన్పించే ఏకైక గ్రహణం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో సూతకకాలం వర్తిస్తోంది. మిగిలిన గ్రహణాలు ఇండియాలో కన్పించలేదు.
ఇండియాలో చంద్ర గ్రహణం సమయం, సూతక కాలం
2023లో రెండవ, చివరి చంద్ర గ్రహణం అక్టోబర్ 28-29 రాత్రి ఏర్పడనుంది. అశ్విని మాసం పౌర్ణిమ రోజున ఈ గ్రహణం ఏర్పడనుంది ిది ఈ ఏడాదిలో చివరి గ్రహణం. అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1 గంట 6 నిమిషాలకు ప్రారంభమై..2 గంటల 22 నిమిషాల వరకూ ఉంటుంది. అంటే మొత్తం 1 గంట 16 నిమిషాలు ఈ చంద్ర గ్రహణం సమయం ఉంటుంది. దీనిని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారు. చంద్ర గ్రహణం సూతక కాలం 8 గంటల ముందే ప్రారంభమౌతుంది. ఇండియా కాకుండా ఈ చంద్ర గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్రం, ఆంటార్కిటికా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహా సముద్రం, ఆఫ్రికాలో కన్పించనుంది.
ధనస్సు రాశి జాతకులకు ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ప్రభావంతో ఊహించని ధనలాభం కలగనుంది. ఆర్దికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. ఉద్యోగస్థులకు చాలా అనువైన సమయంగా భావించాలి. పదోన్నతి, కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యోం మెరుగుపడుతుంది.
ఇక చంద్ర గ్రహణం ప్రభావంతో మిధున రాశి జాతకులకు సైతం ఊహించని ధనలాభం ఉంటుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమౌతుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. పెండింగులో లేదా ఎక్కడైనా నిలిచిన డబ్బులు చేతికి అందుతాయి. ఈ ఏడాది రెండవ, చివరి చంద్ర గ్రహణం ప్రభావంతో ఈ రెండు రాశులకు మాత్రం అమితమైన లబ్ది చేకూరనుంది.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో ఐదు రోజులుల ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook