Gupt Navratri 2023: రాబోయే 9 రోజులు ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

Gupt Navratri 2023: ఇవాల్టి నుండే గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 01:45 PM IST
Gupt Navratri 2023: రాబోయే 9 రోజులు ఈ 5 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

Gupt Navratri 2023: దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా మంచిది. ఎందుకంటే నేటి నుండి గుప్త నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. మాఘ మాస శుక్ల పక్షం ప్రతిపద నుండి గుప్తనవరాత్రులు ప్రారంభమవుతాయి.  ఇవి జనవరి 22 నుండి జనవరి 30 వరకు కొనసాగుతాయి. ఈ రహస్య నవరాత్రులు కొన్ని రాశులవారికి సంపదను చేకూర్చనున్నాయి. దుర్గామాత ఆశీస్సులు ఏ రాశులవారికి లభించనుందో తెలుసుకుందాం. 

గుప్త నవరాత్రులు ఈ రాశులకు శుభప్రదం
మేషం (Aries): గుప్త నవరాత్రులు మేషరాశి వారికి ఉపాధిని కల్పిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. మెుత్తానికి ఈసమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 
కన్య (Virgo): జనవరిలో జరిగే గ్రహ సంచారాలు కన్యారాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తాయి. మీ కెరీర్ పురోగతికి దారులు తెరుచుకుంటాయి. వ్యాపారంలో మంచి లాబం ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో మిత్రులతో సరదాగా గడుపుతారు. 
వృశ్చికం (Scorpio): గుప్త నవరాత్రుల సమయంలో మీరు శుభవార్తలు వింటారు. బిజినెస్ విస్తరిస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

మకరం (capricorn): న్యాయపరమైన విషయాల నుండి ఉపశమనం పొందుతారు. మీరు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. 
మీనం (pisces): మీ తెలివితేటల ఆధారంగా మీరు ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించగలుగుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలకు ఈసమయం అనుకూలంగా ఉంటుంది. పెద్ద వారితో పరిచయాలు ఏర్పడతాయి. 

Also Read: Rajyog: కుంభరాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశులకు చెప్పలేనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News