Laxmi devi puja vidhi: లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ప్రీతికరం. చాలామంది భక్తులు ఆ అమ్మవారిని శుక్రవారమే పూజించడానికి కారణం ఏంటి ? పురాణాల్లో లక్ష్మీదేవికి, శుక్రవారానికి ఉన్న సంబంధం ఏంటి ? పురాణ ఇతిహాసాలను పరిశీలిస్తే.. రాక్షస సంహారి అయిన లక్ష్మీ దేవి రాక్షసుల చేత కూడా పూజలు అందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. మరి రాక్షసులు ఆ అమ్మవారిని కొలవడానికి కారణం ఏంటనే ధర్మ సందేహాలు చాలా మంది భక్తులకు కలుగుతుంటాయి. ఆ ధర్మ సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ కథనం.
పురాణాల ప్రకారం రాక్షసులు అందరికీ ఒక గురువు ఉండేవాడట. ఆ గురువు పేరే శుక్రాచార్యుడు. ఆ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు వచ్చిందని పురాణాలు తెలిసిన పండితులు చెబుతుంటారు. శుక్రవారానికి ఆ పేరు ఎలా వచ్చిందనే సంగతిని ఇక పక్కకుపెడితే... శుక్రాచార్యుడి తండ్రి పేరు భృగు మహర్షి. ఈ భృగుమహర్షిని బ్రహ్మదేవుడి (Lord Brahma) సంతానంలో ఒకరిగా చెబుతుంటారు.
అలా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడని... అందుకే ఆ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతీకరమైనదని పురాణాలు (Why friday is goddess laxmi's day ?) చెబుతున్నాయి. అలాగే తమ గురువుకు సోదరి అయిన లక్ష్మీ దేవి పట్ల రాక్షసులకు కూడా భక్తి ఉండేదని చెబుతుంటారు.
Also read : Shirdi Sai Baba vachans - Ekadasha sutramulu : షిర్డీ సాయిబాబా అనుగ్రహం కోసం సాయి ఏకాదశ సూత్రములు
లక్ష్మీ దేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ఆ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిస్తే.. అమ్మవారు భక్తుల భక్తికి మెచ్చి వారు కోరిన వరాలు ఇస్తుందనేది బలమైన విశ్వాసం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం (How to please goddess Laxmi devi ?) పొందిన వాళ్లు ఆమెను శుక్రవారమే పూజించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీ దేవికి అత్యంత ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం (Varalaxmi vratham) కూడా శుక్రవారమే నిర్వహిస్తారు.
Also read : Pancha Brahma Lingeshwara Temple : దేశంలో ఏకైక పంచ బ్రహ్మలింగేశ్వర ఆలయం విశిష్టత
Also read : Diwali Sentiments: దీపావళి రాత్రి ఆ పక్షి లేదా జంతువుని చూస్తే ఏమవుతుందో తెలుసా
Also read : Navratri 2021: దేవీ నవరాత్రుల ఉపవాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook