Lakshmi Narayan Yog: దీపావళి తర్వాత అరుదైన యోగం... ఈ 3 రాశులవారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

Lakshmi Narayan Yog: ఆస్ట్రాలజీలో కొన్ని యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి వాటిలో లక్ష్మీనారాయణ యోగం ఒకటి. త్వరలో ఇది ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2022, 08:26 AM IST
Lakshmi Narayan Yog: దీపావళి తర్వాత అరుదైన యోగం... ఈ 3 రాశులవారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

Lakshminarayana Yogam: జ్యోతిష్యంలో గ్రహాల గమనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని సార్లు గ్రహాలు వేరే ఫ్లానిట్స్ తో కలిసి ప్రత్యేక యోగాలను ఏర్పరుస్తాయి. దీని ప్రభావం మనిషి జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ నెల 26న అత్యంత శుభప్రదంగా భావించే ప్రత్యేక యోగం ఏర్పడతుంది. అక్టోబరు 26న బుధ గ్రహం కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి ప్రవేశింబోతుంది. ఇప్పటికే తులరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీంతో శుక్రుడు, బుధుడు కలసి కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం వల్ల ఏ రాశి వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. 

లక్ష్మీనారాయణ యోగం ఈ రాశులకు శుభప్రదం
కన్య (Virgo)- లక్ష్మీనారాయణ యోగం వల్ల ఈరాశివారు అపారమైన ప్రయోనజాలను పొందనున్నారు. త్వరలోనే మీరు రుణభారం నుండి విముక్తి  పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. నిరుద్యోగులకు ఉపాధి దొరుతుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): ఈ రాశి వారికి కూడా ఈ యోగం చాలా మేలు చేస్తుంది. దీంతో ధనుస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు కూడా వింటారు. వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా విజయాన్ని  సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. 
మకరం (Capricorn)- లక్ష్మీనారాయణ యోగం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు వ్యాపార, ఉద్యోగాల్లో రాణిస్తారు. అంతేకాకుండా ఈరాశి వారు కెరీర్ లో అద్బుతంగా పురోగమిస్తారు. ఎక్కడైనా మీ డబ్బు ఇరుక్కుపోతే అది తిరిగి వస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. బిజినెస్ విస్తరిస్తుంది. వ్యాపారులు భారీ లాభాలను గడిస్తారు. 

Also Read: Shani Margi 2022: దీపావళికి ముందు ఈ రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం.. ఇక వీరికి తిరుగుండదు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News