Feng shui vastu: వాస్తు ప్రకారం ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన 8 వస్తువులు ఇవే..

Feng shui vastu Tips: ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం వల్ల కూడా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటారు ఇంట్లో ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికి ఉంటుంది

Written by - Renuka Godugu | Last Updated : Jun 30, 2024, 06:16 PM IST
Feng shui vastu: వాస్తు ప్రకారం ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన 8 వస్తువులు ఇవే..

Feng shui vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం వల్ల ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఆనందం, శ్రేయస్సు వస్తుంది. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా అభివృద్ధిని చూస్తారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఉండకూడదు. వాటిని ఇంటి నుంచి త్వరగా బయటికి తీసి పాడేయాలి. అయితే ఈరోజు  వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

నెమలి ఈక..
వాస్తు ప్రకారం ఇంట్లో నేమలి ఈక పెట్టుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో సుకఃశాంతులు వెళ్లి వీరుస్తాయి. అయితే దీనికి ఇంట్లో బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి

తులసి మొక్క..
ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం వల్ల కూడా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటారు ఇంట్లో ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికి ఉంటుంది

అక్వేరియం..
అక్వేరియం ఉండటం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఆక్వేరియం ఇంటికి ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో సుకఃసంతోషాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్నవారికి స్ట్రెస్ తగ్గిపోతుంది.

తాబేలు..
ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల ఇంటికి వాస్తు లాభాలు కలుగుతాయి. ఇంట్లో నెగిటివిటీ తొలగిపోతుంది ఆరోగ్యం అదృష్టానికి కూడా తీసుకువస్తుంది.

శ్రీ యంత్రం..
శ్రీ యంత్రం ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు లేదా ఈశాన్య దిశలో శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంటికి బలాన్ని పెంచుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ఇదీ చదవండి:  శివపూజలో ఇవి నిషిద్ధం.. పొరపాటున సమర్పిస్తే భోళాశంకరుడి ఆగ్రహానికి గురికాక తప్పదు..

విండ్‌ చైమ్స్..
విండ్‌ చైమ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ పెరుగుతుంది అని ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగెటివిటీని తొలగించి మనసు ప్రశాంతంగా ఉంచుతుంది.

బుద్ధ..
ఇంట్లో బుద్ధుని విగ్రహంపై ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇల్లు శాంతియుతంగా ఉంటుంది. మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.  హాల్లో ఈ బుద్ధుని విగ్రహాం ఏర్పాటు చేసుకోవడం వల్ల సుకః శాంతులు వెళ్లి విరుస్తాయి. ఇంట్లో కొన్ని క్రిస్టల్ తో తయారు చేసిన వస్తువులు పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో ఇంటికి శుభం కలుగుతుంది. వీటిని బెడ్ రూమ్ లేదా ఇంటి హాల్లో ఏర్పాటు చేసుకోవాలి.

ఇదీ చదవండి: జూలైలో పుట్టినవారు ఎలా ఉంటారు? ఈ విషయంలో మాత్రం వారు అందరి కంటే ప్రత్యేకం.. 

అయితే మన భారత పురాణాల ప్రకారం గణేశుని విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా శుభాలు కలుగుతాయి. ఇది కూడా ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకుంటే అదృష్టం, ధనాకర్షణ పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News