Jupiter Remedies: ఈ 2 రాశులకు గురు గ్రహం కటాక్షం తప్పనిసరి, ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలి

Jupiter Remedies: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలకు గురువుగా గురు గ్రహాన్ని పరిగణిస్తారు. అందుకే గురు గ్రహానికి సంబంధించిన కదలిక లేదా గోచారం ప్రభావం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటుంది. గురువు అధిపతిగా ఉన్న రాశులకైతే స్వర్గ సుఖాలు అందుతాయి  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2023, 07:28 AM IST
Jupiter Remedies: ఈ 2 రాశులకు గురు గ్రహం కటాక్షం తప్పనిసరి, ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలి

Jupiter Remedies: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుండలిని ప్రత్యేకంగా నమ్ముతారు. ప్రతి ఒక్కరి కుండలి ఒక్కోలా ఉంటుంది. కుండలిలో గ్రహాల స్థితిని బట్టి ఆ వ్యక్తి జాతకం ఉంటుందని చెబుతారు. అందుకే జాతకం చూసేటప్పుడు కుండలిని పరిశీలిస్తుంటారు. 

హిందూ మత విశ్వాసాల ప్రకారం కుండలిలో అన్ని గ్రహాలకు ప్రత్యేక మహత్యముంది. చేసిన పనుల్ని పట్టి ఫలితం ఉంటుంది. ఒకరి కెరీర్‌ను నిర్ణయించే గ్రహాన్ని కెరీర్ లార్డ్ అంటారు. మంచి మంచి ఉద్యోగావకాశాలు అందించడం, ఉన్నత శిఖరాలకు చేర్చేవారిని ఇలా పిలుస్తారు. కొంతమంది ఎంతగా ప్రయత్నాలు చేసినా విఫలమౌతుంటారు. చాలా సందర్భాల్లో కళ్ల ముందే అవకాశాలు చేజారిపోతుంటాయి. అదే కుండలిలో కెరీర్ లార్డ్ బలమైన స్థితిలో ఉంటే అన్ని అవకాశాలు కలుగుతాయి. మిధున, మీన రాశులకు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..

దేవగురువుగా భావించే గురు గ్రహం మీనరాశి జాతకులకు కెరీర్ అధిపతిగా ఉంటాడు. కెరీర్‌లో ఏది అవసరమో అది అందించేందుకు గురు గ్రహం సిద్ధంగా ఉంటాడు. జ్ఞానానికి దేవుడు కెరీర్ లార్డ్ అయినప్పుడు అంతకంటే సంతోషం, అదృష్టం మరొకటి ఉండదు. అపారమైన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

దేవగురువు బృహస్పతిని ప్రసన్నం చేసుకునేందుకు విద్యాదానం చాలా అవసరం. తప్పనిసరి కూడా. ఈ పని మీరే స్వయంగా చేయవచ్చు. లేదా ఎవరి ద్వారానైనా చేయించవచ్చు. మీ సమీపంలోని లేదా మీకు తెలిసిన ఎవరైనా నిరుపేద విద్యార్ధిని చదివించడం ద్వారా ఆ పుణ్యం సంపాదించుకోవచ్చు. మీ కెరీర్‌ను పటిష్టం చేసుకోవచ్చు. నిరుపేద విద్యార్ధి చదువుకు అవసరమైనవన్నీ సమకూర్చవచ్చు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, టిఫిన్ వంటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దేవగురువు బృహస్పతి కటాక్షం ఇందుకు తప్పనిసరి. ఇక మరోవైపు పూర్ణామావాస్య నాడు సత్యనారాయణ కథ వినాలి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం కటాక్షం లభిస్తుందంటారు. కధ విన్న తరువాత పురోహితునికి పసుపు వస్త్రాలు దానం చేయాలి. గురువును ప్రసన్నం చేసుకునేందుకు ఇదే మంచి పద్ధతి.

Also read: Mercury Transit 2023: వృషభరాశి ప్రవేశం, ఆ 5 రాశుల జీవితాల్లో జూన్ 7 నుంచి కల్లోలం తప్పదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News