Janmashtami 2022: ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదంటే.. శ్రీ కృష్ణుడికి ఈ చిన్న వస్తువును సమర్పించండి చాలు!

Shri Krishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18న వస్తుంది. ఈ పండుగ నాడు చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణభగవానుడికి ఇష్టమైన ఈ చిన్న వస్తువును కానుకగా ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి ఇల్లు సిరిసంపదలతో కళకళాడుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 06:49 PM IST
Janmashtami 2022: ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదంటే.. శ్రీ కృష్ణుడికి ఈ చిన్న వస్తువును సమర్పించండి చాలు!

Janmashtami Puja And Remedy: జన్మాష్టమి పండుగను (Shri Krishna Janmashtami 2022) భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో ఈ రోజున జన్మించాడు. ఈ రోజున చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందడానికి అతనికి ఇష్టమైన వస్తువులను సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు రాత్రంతా జాగరణ ఉంటూ.. భజనలు మరియు కీర్తనలతో శ్రీకృష్ణభగవానుడిని కొలుస్తారు. ఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 18, గురువారం వస్తోంది. ఈ రోజు శ్రీకృష్ణభగవానుడు ఆశీస్సులు పొందాలన్నా, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలన్నా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. 

శ్రీ కృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. అందుకే అతడిని మురళీధర అంటారు. వాస్తు ప్రకారం, ఇంట్లో వేణువును ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. చెక్క, వెదురు, వెండి లేదా బంగారం చేసిన వేణువును ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడికి వెండి వేణువును సమర్పించడం ద్వారా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి వ్యాపారంలో నాలుగురెట్లు లాభం పొందుతాడు. వేణువును ఇంట్లో ఉంచడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి. 

Also Read: Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ ఎప్పుడు? రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News