IRCTC Ramayan tour: శ్రీరామాయణ యాత్ర - పుణ్యక్షేత్రాలు, టికెట్ ధరలు, తేదీల వివరాలు

Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌తో ఐఆర్‌సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.

Written by - Pavan | Last Updated : Sep 5, 2021, 05:24 PM IST
  • భారత్‌లో రిలీజియస్ టూరిజంను ప్రోత్సహించేందుకు IRCTC సరికొత్త ప్రయత్నం.
  • డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌లో శ్రీ రామాయణ యాత్ర.
  • 17 రోజుల పాటు కొనసాగనున్న ఈ శ్రీ రామాయణ యాత్ర టికెట్ ధర, యాత్ర వివరాలు
IRCTC Ramayan tour: శ్రీరామాయణ యాత్ర - పుణ్యక్షేత్రాలు, టికెట్ ధరలు, తేదీల వివరాలు

Indian Railways Sri Ramayan Yatra tour packages: భారత్‌లో రిలీజియస్ టూరిజంను ప్రోత్సహించడం కోసం శ్రీ రామాయణ యాత్ర పేరిట ఐఆర్‌సీటీసీ ఓ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌తో ఐఆర్‌సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది. 

ఢిల్లీలోని సప్ధర్‌గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర దేశవ్యాప్తంగా 7,500 కిమీ కవర్ చేయనుంది. నవంబర్ 7 నుంచి 17 రోజుల పాటు శ్రీ రామాయణ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో పాల్గొనే వారికి రామాయణంలో శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను (Ram temples in India) సందర్శించే మహా భాగ్యం అందించనుంది. 

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ముందుగా రామ మందిరం (Ayodhya Ram mandir), హనుమంతుడి ఆలయం, నందిగ్రామ్‌లోని భారత్ మందిరం సందర్శించే అవకాశం దక్కనుంది. అయోధ్య తర్వాత బీహార్‌లోని సీతామడిలో సీతమ్మ జన్మభూమిని సందర్శిస్తారు. అక్కడి నుంచి జనక్‌పూర్‌లోని రామ్ - జానకి మందిరం చూసే అవకాశం లభించనుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేపాల్ వెళ్లి రాముడు నడయాడిన పుణ్యక్షేత్రాలను పర్యటిస్తారు.

Also read : Irctc new rules: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి..!

నేపాల్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం వారణాసి, ప్రయాగ్, శ్రింగ్‌వర్‌పూర్, చిత్రకూట్ సందర్శిస్తారు. వారణాసి (Varanasi trains), ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్ పర్యాటక క్షేత్రాల్లో రాత్రి బస ఏర్పాటు చేస్తారు. అలా నాసిక్, హంపి మీదుగా రామేశ్వరం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శ్రీరామయాణ యాత్రలో రామేశ్వరం (Rameshwaram trains) చివరి పుణ్యక్షేత్రం కాగా అక్కడి నుంచి తిరిగి నేరుగా ఢిల్లీకి వెళ్లేవిధంగా టూర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

AC Deluxe train facilities - ఏసీ డీలక్స్ రైలులో సౌకర్యాలు: 
శ్రీ రామాయణ యాత్రకు ఉపయోగించే రైలు డిలక్స్ ఏసీ రైలు కావడంతో అందులో సౌకర్యాలకు కొదవ ఉండదని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. రెండు డైనింగ్ రెస్టారెంట్స్, ఒక మోడర్న్ కిచెన్, షవర్ క్యుబికల్స్, సెన్సార్ పరిజ్ఞానంతో పనిచేసే వాష్‌రూమ్స్, ఫుట్ మసాజర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ రైలు సొంతం.

CCTV cameras in train: ప్రతీ కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, సెక్యురిటీ గార్డు సేవలు
రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ సదుపాయం కూడా ఉంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రతీ కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, సెక్యురిటీ గార్డు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. 

Also read : Indian Railways: ఇండియన్ రైల్వే స్ నుంచి త్వరలో ఏసీ ఎకానమీ కోచ్‌లు

ఎవరికి ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుందంటే.. 
కరోనావైరస్ మహమ్మారి (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో 18 ఏళ్లకుపైన వయస్సు ఉండి, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా నివారణ కోసం ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి ఓ సేఫ్టీ కిట్ అందించనుంది. అందులో ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లవ్స్, శానిటైజర్ (face masks, hand gloves and sanitiser) ఉంటాయి. 

Sri Ramayan Yatra train ticket price: ఒక టికెట్ ధర ఎంతంటే..
శ్రీ రామాయణ యాత్ర టికెట్ ధర రూ.82,950 గా నిర్ణయించారు. ఏసీ డిలక్స్ రైలులో ప్రయాణం నుంచి మొదలుకుని ఏసీ హోటల్స్‌లో బస చేయడం, ఆహారం, ఏసీ వాహనాల్లో పర్యాటక క్షేత్రాల్లో పర్యటన, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సీటీసీ (IRCTC) టూర్ మేనేజర్స్ సేవలు అన్నీ కలిపి ఈ ధర నిర్ణయించినట్టు ఐఆర్‌సీటీసీ స్పష్టంచేసింది.

Also read : Income Tax Jobs 2021: ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్...అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News