Plants grow at home: హిందూ మత విశ్వాసాల ప్రకారం.. చెట్లకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. చెట్లను పూజించడం సంప్రదాయాల్లో భాగంగా వస్తోంది. అయితే చాల మంది కొన్ని రకాల మొక్కలను పూజించడం, వాటిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకోవాల్సిన కొన్ని మొక్కలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు (Best Plant For Grow at Home) తెలుసుకుందాం.
తులసి (Tulasi Plant)
హిందూ మతంలో తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే చాలా మంది మహిళలు ఉదయాన్నే లేచి తల స్నానం ఆచరించి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. చాలా మంది ఇంటి ముందు తులసి మొక్కలు ఉంటాయి.
ఇలా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు పూజ చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఉండదు. దీనితో పాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయని (Tulasi Plant uses) నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు తులసికి అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
దావనం (Davana Plant)..
తులసిలాగానే.. దావన మొక్కను కూడా చాలా మంది పూజిస్తారు. ఇంటికి నైరుతి దిశలో దీనిని నాటి పూజిస్తే మంచి జరగుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈ మొక్క ఇంటి ముందు ఉంటే.. అప్పుల బాధలు త్వరగా తీరుతాయని నమ్మకం. వీటి పువ్వులను శివుడిని పూజించేందుకు ఉపయోగిస్తారు. దీనికి కూడా ఆయుర్వేద గుణాలు (Davana Plant Uses) ఉంటాయి. ఈ మొక్క మంచి సవాసనను కూడా వెదజల్లుతుంది.
అరటి చెట్టు (Banana Tree)
ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన అరటి కొమ్మలు ఇంటి గుమ్మానికి కట్టడం చూస్తుంటాం. అరటి పండ్లు లేకుండా ఏ శుభకాకర్యం జరగదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అరటిలో విష్టువు ఉండాడని చాల మంది నమ్ముతారు. అందుకే అరటి చెట్టు పెంచుకోవడం, వాటిని పూజించడం వల్ల ఇంట్లో ఎప్పుడు సుఖసంతోషాలు ఉంటాయని (Banana Tree) భావిస్తారు.
(Note: ఈ కథనంలోని విషయాలు వాస్తు నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇందులో పేర్కొన్న విషయాలు కచ్చితంగా జరగుతాయని ZEE NEWS ధృవీకరించలేదు.)
Also read: Blessings of jupiter : కొత్త ఏడాదిలో ఆ మూడు రాశులకు తిరుగులేదు.. బృహస్పతి అనుగ్రహంతో అంతా శుభమే!
Also read: Shoonya masam 2021 : శూన్యమాసంలో ఆ పనులు అస్సలు చేయకండి.. ఇవి కచ్చితంగా చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook