Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?

How to worship Sai Baba on thursday: సాయి బాబాను ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో సాయిబాబా గురించి రాసిన శాస్త్రాల్లో పేర్కొన్నారు. సాయి బాబాను పూజించే వాళ్లలో చాలామంది ఆ పద్దతులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించినప్పటికీ... వాటి వెనుకున్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం (Significance of sai baba puja) ఏంటనేది మాత్రం కొంతమందికే తెలిసి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2021, 09:29 AM IST
Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?

How to worship Sai Baba on thursday: సాయి బాబాను ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో సాయిబాబా గురించి రాసిన శాస్త్రాల్లో పేర్కొన్నారు. సాయి బాబాను పూజించే వాళ్లలో చాలామంది ఆ పద్దతులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించినప్పటికీ... వాటి వెనుకున్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం (Sai baba puja mahatyam) ఏంటనేది మాత్రం కొంతమందికే తెలిసి ఉంటుంది. శాస్త్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం పూజా విధానంలో ఏయే పద్ధతి వెనుక ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

శాస్త్రాల ప్రకారం సాయి బాబాకు దీపారాధన (Deeparadhana) చేస్తే బుద్ధి బలం కలిగి పాపాలు నశిస్తాయి. సాయి బాబాకు దూపం (Dhupam) వేయడం వల్ల ధనం ప్రాప్తి కలుగుతుంది. మనసులోని చెడు ఆలోచనలు నశించి సన్మార్గం వైపు ప్రయణిస్తారు. షిరిడి సాయికి గంధం (Sandal) సమర్పిస్తే పుణ్యం కలుగుతుంది. 

Also read : Today Horoscope In Telugu 10 June 2021: నేటి రాశి ఫలాలు, ఓ రాశివారికి ఉద్యోగావకాశాలు

సాయినాథుడికి తాంబూలం (Tamboolam / tamalapakulu) సమర్పించడం వల్ల ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. సాయిబాబాకు నైవేద్యం (Naivedyam) సమర్పించడం వల్ల ఆయుష్షు పెరిగి జీవితంలో మానసిక సంతృప్తి లభిస్తుంది. కర్పూరంతో హారతి (Karpuram aarati) ఇస్తే అది అజ్ఞానపు చీకటిని చీల్చుతుంది అని భక్తులు విశ్వసిస్తారు.  

అభిషేకాలు ఎన్నిరకాలు, ఏయే ఫలితాలు (Types of abhishekams)..
షిరిడి సాయి బాబాకు భక్తితో అభిషేకం చేస్తే మనసు పరిశుద్ధమవుతుంది. అయితే అభిషేకంలోనూ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఆ దేవున్ని కొలుస్తారు. శాస్త్రాల ప్రకారం ఏయే పద్ధతిలో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

సాయి బాబాకు జలాభిషేకం (Jalabhishekam) చేస్తే భుక్తి, ముక్తి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. క్షీరాభిషేకం (Ksheerabhishekam) చేస్తే దుఖనాశనం కలుగుతుంది. తేనేతో (Honey) సాయిని అభిషేకిస్తే.. గొప్ప ధనవంతుడు అవుతాడు. పంచదార పాలతో అభిషేకం చేస్తే.. మహా మేధావులవుతారు. చెరుకు రసంతో (Sugarcane juice) అభిషేకం చేస్తే.. సర్వవిధాల సంతృప్తి కలుగుతుంది. దేవుడిని ఆరాధించడంలో (Spiritual) ఇలా ఒక్కో పద్ధతి వెనుక ఒక్కో కారణమే ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Also read: Solar Eclipse 2021 Date, Timings: తొలి సూర్య గ్రహణం 2021, జూన్ 10న ఆకాశంలో అద్భుతం, Ring of Fire

Also read : Chandra Grahanam 2021: చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయకూడదు, వీటికి దూరంగా ఉంటే ప్రయోజనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News