Horoscope Today August 4th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తాము ప్రేమించే వ్యక్తిని కలుసుకునే ఛాన్స్...

 వ్యక్తుల జాతకంలో గ్రహ బలం, దైవ బలం వారిని సరైన దారిలో నడిపిస్తాయి. ఒకవేళ ఈ రెండూ రివర్స్‌లో ఉన్నట్లయితే ఆయా వ్యక్తులకు ప్రతికూల ఫలితాలు తప్పవు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు అనుకూలంగా ఉంది, ఏయే రాశులకు ప్రతికూలంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2022, 06:46 AM IST
  • ఇవాళ గురువారం.. శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు
  • లక్ష్మీ సమేతంగా విష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు
  • ఈ గురువారం ఎవరి జాతక ఫలం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today August 4th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తాము ప్రేమించే వ్యక్తిని కలుసుకునే ఛాన్స్...

Horoscope Today August 4th 2022:  వ్యక్తుల జాతకంలో గ్రహ బలం, దైవ బలం వారిని సరైన దారిలో నడిపిస్తాయి. ఒకవేళ ఈ రెండూ రివర్స్‌లో ఉన్నట్లయితే ఆయా వ్యక్తులకు ప్రతికూల ఫలితాలు తప్పవు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు అనుకూలంగా ఉంది, ఏయే రాశులకు ప్రతికూలంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి (Aries)

వ్యాపార కార్యకలాపాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మున్ముందు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు చేపట్టినవారు, ఇతరత్రా ప్రభుత్వ సంబంధిత పనులు చేసేవారు లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రతికూల సమయం. ఎంత కష్టపడినప్పటికీ అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ మరింత వికసిస్తుంది. ప్రియురాలు లేదా ప్రియుడికి ఇచ్చిన మాట నిలుపుకుంటారు.

వృషభ రాశి (Taurus)

ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడుతారు. రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. మీ కష్టపడే తత్వమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఆసక్తుల విషయంలో ప్రాధాన్యత రీత్యా ముందుకు సాగాలి. మీ శక్తి, సామర్థ్యాలు ఇతరులను ఆకర్షిస్తాయి. వాహన సంబంధిత విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. భారీగా అప్పు ఇచ్చే విషయంలో సన్నిహితులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.

మిథున రాశి (GEMINI)

సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు.చేపట్టిన పనిని పూర్తి చేయడం మీలో ఆత్మవిశ్వాసాన్ని ఉత్తేజపరుస్తుంది. విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి. కీలక విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. స్నేహితులు,కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.  వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి.

కర్కాటక రాశి (Cancer) 

దంపతులు, ప్రేమ జంటల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో కఠినంగా మాట్లాడవద్దు. అవివాహితులైన బ్యాచిలర్స్‌కి పెళ్లి సంబంధాలు వస్తాయి. న్యాయపరమైన వివాదాలు సమసిపోతాయి. ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ చేస్తారు. అందరి ముందు చీటికి మాటికి ఎమోషనల్ కావొద్దు. పెద్దలు చెప్పిన మాటలు వినండి. వ్యాపారంలో విజయం సొంతమవుతుంది.  ఉద్యోగస్తులకు బదిలీ అవకాశం ఉండొచ్చు.

సింహ రాశి (LEO)

రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తుల గౌరవం,ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో ఒక్కసారిగా లాభాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా మునుపెన్నడూ చూడని పరిస్థితులు మీకు కొత్తరకమైన అనుభవాన్ని కలిగిస్తాయి. ఒడిదుడుకులను ఎదుర్కోవడం నేర్పుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి గుడ్ న్యూస్ అందవచ్చు. పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీరు అనుకున్నంత సాఫీగా సాగకపోవచ్చు. కుటుంబ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలు, ఆర్థిక వ్యవహారాలు మిమ్మల్ని  కొంత ఒత్తిడిలోకి నెట్టుతాయి. అత్యుత్సాహం మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. పెద్దల ఆశీస్సులతో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. టైమ్ మేనేజ్‌మెంట్‌ను బాగా పాటిస్తారు.

తులా రాశి (Libra)

ప్రాపర్టీ సంబంధిత బిగ్ డీల్స్ ద్వారా భారీ మొత్తంలో ప్రాఫిట్స్ పొందుతారు. మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపార, ఉద్యోగ రీత్యా చేసే అధికారిక ప్రయాణాలు కలిసొస్తాయి. కొత్త వ్యక్తులతో కలిసి చేసే బిజినెస్ లేదా పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండండి. అన్నీ పరిశీలించాకే రంగంలోకి దిగండి. మీ లైఫ్ స్టైల్ మునుపటికన్నా బాగుంటుంది. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు.

వృశ్చిక రాశి (Scorpio)

భావోద్వేగపూరిత నిర్ణయాలు కలిసిరాకపోవచ్చు. పైగా కొన్ని విషయాల్లో అవి మీకు హానీ చేయవచ్చు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అది మీ ఇమేజ్‌ను, హెల్త్‌ను దెబ్బతీస్తుంది. లక్ష్య సాధనలో మీ దగ్గరి బంధువు ఒకరు మీకు చాలా సహాయపడుతారు. సోషల్ ఈవెంట్స్ లేదా పుణ్యక్షేత్రాల సందర్శన ఇష్టపడుతారు.వ్యక్తిగత జీవితం సజావుగా సాగుతుంది. ఆస్తి తగాదాల్లో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.

ధనుస్సు రాశి (Sagittarius)  

సంతోషం, మనశ్శాంతి కరువవుతుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి యుద్ధమే జరగవచ్చు. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్యలన్నీ సర్దుకుంటాయి. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంటారు. భార్యభర్తలు ఒకరితో ఒకరు చర్చించాకే ఈ విషయంలో ముందడుగు వేయాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ్టి నుంచి మంచి ఫలితాలు పొందుతారు.

మకర రాశి (Capricorn) 

ఏదో ఒక విషయంలో జీవిత భాగస్వామితో గొడవ జరగవచ్చు. పురుషులపై స్త్రీలదే పైచేయి అవుతుంది. ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. అయితే మీ తల్లి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక భావన ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వ్యవహరిస్తారు. 

కుంభ రాశి (Aquarius)

వ్యాపారపరంగా అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఫార్మా రంగంలో ఉన్న వ్యాపారస్తులకు బిగ్ బూమ్ ఉంటుంది. మెడికల్ స్టోర్స్ నిర్వహించేవారు, ఫార్మా కంపెనీలు నిర్వహించేవారు భారీగా లాభపడుతారు. ఉద్యోగస్తులు మరింత ఆదాయం కోసం చిన్నపాటి బిజినెస్ లేదా ఇతరత్రా పనులు చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు మరింత బలపడుతాయి. మీరు ప్రేమించే వ్యక్తిని కలుసుకుంటారు. అయితే ఆమె లేదా అతని ప్రైవసీని మీరు గౌరవించాలి.

మీన రాశి (Pisces) 

ఇవాళ మీకు అన్నివిధాలుగా కలిసొస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. ఇవాళ్టి నుంచి కొత్త బిజినెస్ ప్రారంభించాలనుకుంటే మరో ఆలోచన అక్కర్లేదు. నిశ్చింతగా కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మునుపటికన్నా ఎమోషనల్‌గా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: అందుకే ఆత్మహత్య.. లేఖ దొంగతనం కూడా.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి

Also Read: Mahesh Babu: బాలీవుడ్ ఎంట్రీపై అప్పుడలా.. ఇప్పుడిలా.. మహేష్ కు తప్పడం లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News