Horoscope Today January 24 2022: నేటి రాశి ఫలాలు... ఆ రాశివారు శుభవార్త వింటారు..!

Horoscope Today: కొన్ని రాశులవారి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మరికొన్ని రాశులవారికి మిశ్రమ కాలం నడుస్తోంది. నేటి రాశిఫలాలు వివరాలు..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 07:50 AM IST
  • సోమవారం.. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రాశుల వారికి అన్ని మిశ్రమ ఫలితాలే
Horoscope Today January 24 2022: నేటి రాశి ఫలాలు... ఆ రాశివారు శుభవార్త వింటారు..!

Horoscope Today: ఏదైనా పని  మెుదలుపెట్టాలన్నా... శుభకార్యాలను చేయాలన్నా...ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తాం. ఈరోజు ఎలా ఉంటుందోనని రాశిఫలాల(Horoscope)పై దృష్టి సారిస్తాం. నేటి (జనవరి 24 వ తేదీ ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

మేషం (Aries): ఈరోజు ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
వృషభం (Taurus) : ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటే మంచి ఫలితాలను సాధిస్తారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.

మిధునం (Gemini): ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం రంగంలో క్రమంగా ఎదుగుతారు. స్నేహితుల సహాయంతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు.

కర్కాటకం (Cancer): ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అనవసర ధన వ్యయం చేస్తారు. తోటివారితో ఆనందం గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read: Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..

సింహం (Leo): ఈరోజు ఈ రాశివారు స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.

కన్య (Virgo) : మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్త వింటారు. బాధకలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు.

తుల (Libra) : ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో  ఆచితూచి వ్యవహరించాలి. అనవసర విషయాలతో కాలక్షేపం చేయకండి. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా జరిగేలా చూసుకోవాలి. మానసికంగా సంతోషంగా ఉండేలా చూసుకోండి.

వృశ్చికం (Scorpio) : ఈ రాశివారికి బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  సందర్భానుసారంగా ముందుకు సాగితే మేలు.

ధనస్సు (Sagittarius) : ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కీలక పనులను చేసే ముందు తగిన ఆలోచన చేయాల్సి ఉంటుంది.  శ్రమ ఫలిస్తుంది. ధనలాభం పొందుతారు.

మకర (Capricorn): ఈరోజు ఈ రాశివారు అన్ని రంగాల వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అనవసర వ్యయానికి దూరంగా ఉండడం మంచిది. మనశాంతి  ఉండేలా చూసుకోవాలి. 

కుంభం (Aquarius) : ఈరాశివారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంతోషంగా గడుపుతారు. నచ్చిన ఆహారం తింటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మీనం (Pisces) :  ఈరోజు ఈరాశివారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటే మంచిది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News