GemStones for Prosperity and Wealth: వ్యక్తిగత, కుటుంబ పురోగతి కోసం ప్రతీ వ్యక్తి కష్టపడి పనిచేస్తారు. కానీ కొన్నిసార్లు జాతకంలో గ్రహాల స్థితి కారణంగా.. కొందరు వ్యక్తులు ఎంత కష్టపడినా ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోతాడు. అయితే రత్న శాస్త్రం ప్రకారం జాతక ఆధారంగా కొన్ని రత్నాలు ధరించడం వారికి కలిసొస్తుందని రత్న శాస్త్ర నిపుణులు చెబుతారు. వ్యక్తుల ఆర్థిక పురోగతి కోసం రత్న శాస్త్రంలో 3 ప్రత్యేక రత్నాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
జేడ్ స్టోన్ :
రత్న శాస్త్రంలో సూచించిన రత్నాల్లో జేడ్ స్టోన్ ఒకటి. ఈ స్టోన్‌ని ధరించడం వల్ల వ్యక్తి ఆర్థికంగా పురోగతి చెందుతాడు. అంతే కాదు, చేపట్టిన పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. పచ్చ రాయి అనేది పచ్చ రత్నం, ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఈ రత్నం సహాయంతో వ్యాపారపరమైన నిర్ణయాల్లో సరైన ధోరణితో వ్యవహరించగలరు. కొత్త ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.
జేడ్ స్టోన్ ఈ రాశుల వారు ధరించవచ్చు :
జేడ్ స్టోన్‌ని వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు ధరించవచ్చు. అయితే జ్యోతిష్యుని సలహా మేరకు వాడాలని గుర్తుంచుకోండి.
ఆకుపచ్చ అవెంచురిన్ రత్నాలు :
జేడ్ స్టోన్ కాకుండా వ్యక్తుల ఆర్థిక పురోగతికి దోహదపడే రత్నాల్లో ఆకుపచ్చ అవెంచురిన్ రత్నం కూడా ఒకటి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల వ్యక్తి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మరియు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.
అవెంచురిన్ రత్నాలు ఈ రాశుల వారు ధరించవచ్చు :
ఆకుపచ్చ అవెంచురిన్ రత్నాలు ముఖ్యంగా తుల రాశి వారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
పులి రత్నాలు :
రత్న శాస్త్రంలో, ఈ రత్నం అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపేదిగా పరిగణించబడుతుంది. దీన్ని ధరించడం వల్ల వ్యక్తి దృఢ సంకల్పం పెరుగుతుంది. కష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగం పుంజుకుంటాయి.
పులి రత్నాలు ఈ రాశుల వారు ధరించవచ్చు :
రత్న శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పులి రత్నాలు మిథున రాశి వారు ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also read: India-China Border: దేనికైనా రెడీ..చైనాకు ధీటుగా భారత్ సమాధానం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.