Gemology: అదృష్టం తిరగరాసేందుకు...అంతులేని ధనం కోసం...ఈ 4 రత్నాలు ధరించండి

Gemology: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులకున్నట్టే..రత్నాలకు కూడా ప్రాధాన్యత, మహత్యముంది. రత్నశాస్త్రంలో రాశిని బట్టి ధరించాల్సిన రత్నాల ప్రస్తావన వివరంగా ఉంది. గ్రహాల స్థితి ఆధారంగా రత్నాలు ధరించాల్సి ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2022, 09:26 PM IST
Gemology: అదృష్టం తిరగరాసేందుకు...అంతులేని ధనం కోసం...ఈ 4 రత్నాలు ధరించండి

Gemology: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులకున్నట్టే..రత్నాలకు కూడా ప్రాధాన్యత, మహత్యముంది. రత్నశాస్త్రంలో రాశిని బట్టి ధరించాల్సిన రత్నాల ప్రస్తావన వివరంగా ఉంది. గ్రహాల స్థితి ఆధారంగా రత్నాలు ధరించాల్సి ఉంటుంది. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 12 రాశులకు 12 వేర్వేరు రత్నాలతో సంబంధముంది. రత్నశాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఓ రత్నముంది. కుండలిలో గ్రహాల అశుభాన్ని దూరం చేసేందుకు, శుభ ప్రభావాన్ని పెంచేందుకు రత్నాలు ధరించమనే సలహా ఇస్తుంటారు జ్యోతిష్య పండితులు. అయితే జ్యోతిష్యుడి సూచనల్లేకుండా రత్నం ధరించకూడదట. జ్యోతిష్యుడి సలహా మేరకు ఆ మూడు రత్నాలు ధరిస్తే..అంతులేని డబ్బులు మీ సొంతమౌతాయి. 

గోల్డెన్ జెమ్

జ్యోతిష్యశాస్త్రంలో రత్నాలు, రాశులు, గ్రహాల సంబంధం గురించి వివరంగా ప్రస్తావించారు. గోల్డెన్ జెమ్ లేదా సిట్రిన్ ముఖ్యమైంది. అంతులేని ధనం పొందాలంటే గోల్డెన్ జెమ్ ధరించాలని సలహా ఇస్తున్నారు పండితులు. డబ్బు విషయంలో ఈ రత్నం చాలా ప్రత్యేకమైంది. ఈ రత్నం ధరిస్తే ఇంట్లో డబ్బు సమస్యే ఉండదట. జ్యోతిష్యుడి సలహా మేరకు మీ రాశి, గ్రహం ప్రకారం ఈ రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. 

జెడ్ స్టోన్

రత్నశాస్త్రంలో వ్యాపార సంబంధిత విషయాల్లో కొన్ని ప్రత్యేకమైన రత్నాల గురించి ఉంది. ఇందులో జెడ్ స్టోన్ ఒకటి. వ్యాపారంలో సమస్యలు ఎదురౌతుంటే..జెడ్ స్టోన్ ధరిస్తే ఆ సమస్యలన్నీ దూరమౌతాయి. లేదా ఆదాయం సరిగ్గా లేకపోయినా..ఈ రత్నం ధరిస్తే సమస్య నుంచి గట్టెక్కుతారు. జెడ్ స్టోన్ ధారణ వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు. 

ఎమెరాల్డ్ స్టోన్

రత్నశాస్త్రంలో ఎమెరాల్డ్ స్టోన్‌కు ప్రత్యేక మహత్యముంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారు, కన్యారాశి జాతకులకు ఎమెరాల్డ్ ధరించమని సూచిస్తుంటారు. ఎమెరాల్డ్ ధరించడం వల్ల ఉద్యోగాలు లభించడం లేదా ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.

టోపాజ్ స్టోన్

టొపాజ్ స్టోన్ అనేది గురుడి రత్నంగా చెబుతారు. కుండలిలో గురుడి బలహీనంగా ఉన్నా లేదా..గురుడి అశుభ ప్రభావమున్నా టోపాజ్ స్టోన్ ధరించాలి. ఈ రత్నాన్ని ఎక్కువగా సుఖ సౌభాగ్యాల కోసం ధరిస్తారు. ఈ రత్నం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో అభివృద్ధి కన్పిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. 

Also read: Numerology: మీ పుట్టిన తేదీ టోటల్ అదేనా..అంతులేని ధన సంపదలు మీ సొంతం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News