Secret power in gayatri mantra's 24 letters: హిందూ పురాణాల ప్రకారం.. 'గాయత్రి మాత' జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని 'నిర్జల ఏకాదశి' అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులలో ఉత్తమమైనది. గాయంత్రీ జయంతి రోజున.. గాయత్రి మాతను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ సంవత్సరం గాయత్రి జయంతిని జూన్ 11న జరుపుకుంటారు.
గాయత్రీ జయంతి ముహూర్తం:
ఈ సంవత్సరం గాయత్రి జయంతిని శనివారం (జూన్ 11) జరుపుకుంటారు.
ఏకాదశి తిథి ప్రారంభం - జూన్ 10, 2022 ఉదయం 07:25 గంటలకు
ఏకాదశి తిథి ముగుస్తుంది – జూన్ 11, 2022 ఉదయం 05:45 గంటలకు
గాయత్రీ జయంతి పూజ విధానం:
గాయత్రీ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇంట్లో దీపం వెలిగించి.. గంగాజలంతో అన్ని దేవతలకు అభిషేకం చేయాలి. ఆపై గాయత్రి మాతని ధ్యానిస్తూ.. గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ గాయత్రీ తల్లిని ఆరాధించాలి. అమ్మకు సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి.
గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధ్యో యో న: ప్రచోదయాత్
గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం:
హిందూ మతం ప్రకారం.. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని పఠించే వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉంటాడు. 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి ప్రత్యేక అర్థం ఉంది. గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలకు ఇరవై నాలుగు శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. గాయత్రి మంత్ర పఠనం జీవితంలో మీరు ఎదుర్కునే అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. 24 దేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే.. కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.
ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి:
1. తత్ - విఘ్నేశ్వరుడు
2. స - నరసింహస్వామి
3. వి- శ్రీమహావిష్ణువు
4. తుః - శివుడు
5. వ- శ్రీకృష్ణుడు
6. రే - రాధాదేవి
7. ణ్యం - శ్రీమహాలక్ష్మి
8. భ- అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రుడు
10. దే - సరస్వతీదేవి
11. వ - దుర్గాదేవి
12. స్య - ఆంజనేయ స్వామి
13. ధీ - భూదేవి
14. మ- సూర్యభగవానుడు
15. హి- శ్రీరాముడు
16- ధి- సీతాదేవి
17. యో - చంద్రుడు
18. యో- యముడు
19. నః - బ్రహ్మ
20. ప్ర - వరుణుడు
21. చో - శ్రీమన్నారాయణుడు
22. ద- హయగ్రీవుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీమాత
Also Read: Nayanthara-Vignesh Shivan: కాబోయే భార్య నయనతారకు విఘ్నేష్ స్పెషల్ ట్రీట్.. బుజ్జగించి మరీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook