Friday Laksmi Devi Mantra: హిందువులు వారంలోని ఏడు రోజులు ఒకొక్క దేవత లేదా దేవుడిని పూజిస్తారు. ఆదివారం సూర్య భగవానుడిని, సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేస్వామి/సుబ్రహ్మణ్య స్వామిని, బుధవారం అయ్యప్ప స్వామి/గణేషుడిని, గురువారం మహావిష్ణువుని, శుక్రవారం శ్రీమహాలక్ష్మిని, శనివారం వేంకటేశ్వరస్వామిని పూజిస్తారు. అయితే ప్రజలందరూ ఐశ్వర్య ప్రదాతగా భావించే శ్రీ మహాలక్ష్మిని శుక్రవారం అత్యంత భక్తిశ్రద్దలతో పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పూజిస్తే.. ఆర్ధిక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి.
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ సూక్తాన్ని చదవాలి. శ్రీ సూక్త పఠించే ముందు లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు, తామర పూలు, కమల గట్ట, తెల్లటి మిఠాయి, ఖీరు, అక్షతం, కుంకం, ధూపం, దీపం, అగరబత్తులు మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి పూజించాలి. ఆపై శ్రీ సూక్త పారాయణ చేయాలి. శ్రీ సూక్త పఠనం ద్వారా పేదరికం తొలగిపోతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా విముక్తి లభిస్తుందని కాశీ జ్యోతిష్కుడు చక్రపాణి భట్ చెప్పారు. శ్రీ సూక్తం గురించి తెలుసుకుందాం.
శుక్రవారం రోజున ఈ సూక్తం చదవండి:
1. ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ
2. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ
3. ఓం శ్రీం శ్రీ అయే నమ
4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే.. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః
6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ
7. ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం
8. ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ఏకాదశాక్షర సిద్ధ్
శుక్రవారం నాడు పైన ఉన్న మంత్రంతో లక్ష్మీ దేవిని పూజించాలి. ఆలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్దలతో ఈ మంత్రాలను జపించడం వల్ల జీవితంలో ఆనందం, సంపద, వైభవం, శ్రేయస్సు లభిస్తాయి. ఇక జీవితంలో లక్ష్మి అనుగ్రహం మీకు కావాలంటే.. మీరు ప్రతిరోజూ పూజ చేసిన అనంతరం ఈ మంత్రాలను జపించడం మంచిది. ఈ మంత్రాలను పఠిస్తూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. ఆర్ధిక కష్టాలు తొలగిపోయి ధన లాభం కలుగుతుంది.
Also Read: Major Twitter Review: రేటింగ్, గీటింగ్ జాన్తా నయ్.. 'మేజర్' సినిమా చూడాల్సిందే!
Also Read: AP 10th Results: రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook