Five Planets: ఆకాశంలో అద్భుతం జరగనుంది. 18 ఏళ్ల తరువాత రేపు ఐదు గ్రహాలు సమ్మేళనం జరగనుంది. ఒకే వరుసలో ఐదు గ్రహాల కదలిక భౌగోళికంగా అద్భుతం కాగా..జ్యోతిష్యపరంగా ప్రయోజనాలున్నాయంటున్నారు పండితులు.
ఆకాశంలో శుక్రవారం అంటే జూన్ 24వ తేదీన ఏకంగా 18 ఏళ్ల తరువాత ఓ అద్భుతం జరగనుంది. సౌర మండలంలో ఐదు గ్రహాలు ఒకేసారి ఒకే వరుసలో కన్పించనున్నాయి. భూమ్మీద నుంచి కూడా ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు. గతంలో ఈ అద్భుతం 2004లో జరిగింది. అప్పుడు బుధుడు, శక్రుడు, మంగళ, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో కన్పించాయి. స్కై ఎండ్ టెలీస్కోప్ మేగజైన్ అందించిన వివరాల ప్రకారం మూడు గ్రహాలు ఒకే వరుసలో కన్పించడం సాధారణమే కానీ, ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించడం చాలా అరుదైన దృశ్యం.
అమెరికా ఆస్ట్రోనాటికల్ సొసైటీ ప్రచురించిన సైన్స్ మేగజైన్ ప్రకారం సూర్య గ్రహం నుంచి ఒకే వరుసలో కన్పించనున్నాయి. సౌరమండలంలోని ఈ ఐదు గ్రహాలు జూన్ 3, 4 తేదీల్లో కన్పించాయి. కానీ జూన్ 24న అంటే రేపు మాత్రం ఒకేసారి ఒకే వరుసలో కన్పించనున్నాయి. గ్రహాల ఈ సంగమాన్ని శుక్రవారం ఉదయం వీక్షించవచ్చు. ఊదయం సూర్యకాంతి మొత్తం ఆకాశంలో ప్రసరించడానికి ముందే..ఈ గ్రహాల్ని నేరుగా కంటితో వీక్షించవచ్చు.
రాయల్ మ్యూజియం గ్రీన్‌విచ్‌కు చెందిన డాక్టర్ గ్రేగ్‌బ్రౌన్ చెప్పిందాని ప్రకారం..ఐదు గ్రహాల్ని చూసే అవకాశం రేపు ఉదయం సూర్యోదయానికి ముందు..అతి తక్కువ సమయం కన్పించనుంది. శుక్రగ్రహం ఉదయం నాలుగు గంటలకు కన్పించనుంది. మంగళ, గురు గ్రహాలు మూడు గంటలకు ఒకే వరుసలో కన్పించనున్నాయి.
అటు స్కై వాచింగ్ నిపుణుల ప్రకారం ఈ గ్రహాల్ని ఉదయం వేళ దక్షిణ తూర్పు రేఖాంశం వైపు కన్పిస్తాయి. రేపు ఒకవేళ వాతావరణం స్పష్టంగా ఉంటే ఈ గ్రహాల్ని చూడవచ్చు. కాస్సేపటి తరువాత గ్రహాల మధ్య దూరం పెరిగిపోతుంది.
Also read: Plant Vastu: మీ కెరీర్‌లో వేగంగా పురోగతి ఉండాలంటే...ఈ అద్భుతమైన మెుక్కను ఇంట్లో నాటండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.