Chandra Grahan Bad Effect 2023: ఆస్ట్రాలజీలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి మే 05న అంటే వైశాఖ పూర్ణిమ నాడు తొలి చంద్రగ్రహణం సంభవించబోతుంది.ఈ గ్రహణం తులరాశిలో ఏర్పడబోతుంది. చంద్రగ్రహణం సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
చంద్రగ్రహణం ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
మేషరాశి
ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం మేషరాశి వారికి అశుభకరంగా ఉండనుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిమ్మల్ని అనేక సమస్యలు చుట్టుముడతాయి. మీకు కాలం అస్సలు కలిసిరాదు.
వృషభం
ఈసారి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, అందుకే సూతక కాలం కూడా చెల్లదు. వృషభరాశి వారికి ఈ గ్రహణం అస్సలు కలిసిరాదు. మీకు ఇతరులతో గొడవలు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వభేదాలు వస్తాయి.
కర్కాటక రాశి
తొలి చంద్రగ్రహణం కర్కాటక రాశివారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మిమ్మల్ని అనేక సమస్యలు చుట్టుముతాయి.
Also Read: Budh uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..
సింహరాశి
లునార్ ఎక్లిప్స్ సింహ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో భారీగా నష్టపోతారు.
Also Read: Lucky Zodiac: మే నెలలో ఈ రాశులవారే అదృష్టవంతులు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook