Feng Shui Tips for Unmarried People: చైనీస్ ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం గదిలోని వస్తువులు కూడా సరైన దిశలో ఉండాలి. కొన్ని వస్తువులు గదిలో లేకపోవడమే మంచిది. అవివాహితులకు సంబంధించి కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌లో ఉంచకూడదని ఫెంగ్ షుయ్ చెబుతోంది. ఆ వస్తువులేంటో ఇక్కడ తెలుసుకోండి..
పెళ్లికాని వారి పడకగదిలో ఈ వస్తువులు ఉండవద్దు :
అవివాహితులు తమ పడక గదిలో టీవీ, కంప్యూటర్ పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టినట్లయితే.. అది వారి జీవితాల్లో కమ్యూనికేషన్ లోపానికి కారణం కావొచ్చు. ప్రేమ జీవితంలో ఇబ్బందులకు గురి కావొచ్చు.
పెళ్లి కాని వారు తమ పడకగదిలో నది, చెరువు, జలపాతం మొదలైన నీటికి సంబంధించిన ఎలాంటి చిత్రాలను పెట్టుకోకూడదు. ఇది వారి భవిష్యత్ వైవాహిక జీవితంలో సమస్యలకు దారి తీస్తుంది.
పడకగదిలో విభజన, గది మధ్యలో బీమ్, లేదా గది మధ్యలో స్తంభాలు ఉండటం మంచిది కాదు. అవి వివాహ బంధానికి అడ్డంకులు సృష్టిస్తాయి. కాబట్టి అలాంటి గదిలో పడుకోవద్దు.
అవివాహితులు తమ బెడ్‌రూమ్‌కి టాయిలెట్-వాష్‌రూమ్ అటాచ్‌మెంట్ ఉంటే.. ఆ తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి.
పెళ్లికాని వారు తమ బెడ్‌రూమ్‌లో ఏ మూలకు లేదా కిటికీకి మంచం పెట్టకూడదు.
పడకగదిలో అద్దాలు పెట్టుకోకూడదు. ఇప్పటికే అద్దం ఉంటే.. ఏదైనా వస్త్రంతో దాన్ని కవర్ చేయండి.
(గమనిక - ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ న్యూస్ దీన్నిధ్రువీకరించలేదు.)
Also Read: UP Violence: అల్లర్లకు పాల్పడితే ఇల్లు నేలమట్టం.. బుల్‌డోజర్లను దించేసిన యోగీ
Also Read: Pitradosh: పితృ దోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు