Money Feng Shui Tips: చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్‌లో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడం, నెగెటివ్ ఎనర్జీని దూరం చేయడం వంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇంట్లో ప్రతికూలత ఉంటే వారి కెరీర్ లో ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు మెుదలైనవి చోటుచేసుకుంటాయి. వీటికి చెక్ పెట్టడానికి ఫెంగ్ షుయ్ (Feng Shui Tips) యొక్క వాస్తు నియమాలను అనుసరించండి.
ఫెంగ్ షుయ్ వాస్తు చిట్కాలు
>> ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంటికి దగ్గరలో గుడి ఉండకూడదు. ముఖ్యంగా ఆలయం యెుక్క నీడ ఇంటిపై పడకూడదు.
>> ఇంటి వెనుక తలుపు ముందు తలుపుకు ఎదురుగా ఉండకూడదు.
>> ఇంటి ప్రధాన ద్వారం ముందు స్తంభం ఉంటే.. దానిని పొరపాటున కూడా పగలగొట్టవద్దు. ఆ స్తంభానికి అద్దం పెట్టండి.
>> ఫెంగ్ షుయ్ లో వంటగది మరియు టాయిలెట్ ఎదురుగా ఉండటతం తప్పుగా భావిస్తారు. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే...ఒక క్రిస్టల్ బాల్‌ను తలుపు మీద వేలాడదీయండి.
>> ఇంటి మధ్యలో మెట్లు వేయకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబ పెద్దకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది.
>> ఫెంగ్ షుయ్లో, ఆఫీసు గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఆఫీసులో కుర్చీ వెనుక భాగం ఎత్తుగా ఉండాలి. అలాగే, కూర్చునే ప్రాంతం వెనుక ఖాళీ ప్లేస్ ఉంటే మంచిది. దీంతో ఆఫీసులో సీనియర్లు, జూనియర్ల నుంచి మీకు సపోర్టు లభిస్తుంది.
>> ఇంట్లో కిటికీల తలుపులు బయటికి తెరవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివిటీ వస్తుంది. అలాగే మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.
Also read: Tulsi Vastu Tips: ఈ విధంగా తులసి మెుక్కను నాటితే.. ఇక చూస్కోండి మీ ఇంటి నిండా డబ్బే డబ్బు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook