February 2024 Careful Zodiac: ఫిబ్రవరి నెలలో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే అంతే సంగతి!

February 2024 Careful Zodiac: శని గ్రహం గమనంలో ఫిబ్రవరి నెలలోని అనేక మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశివారికి ఈ సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 09:46 AM IST
February 2024 Careful Zodiac: ఫిబ్రవరి నెలలో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే అంతే సంగతి!

 

February 2024 Careful Zodiac: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కీడు, న్యాయానికి సూచికగా పరిగణిస్తారు. శని దేవుడు ఎలాగైతే కర్మలకు దగ్గ ప్రతి ఫలాలిస్తాడో..శని గ్రహం కూడా జాతకంలో స్థానాలను బట్టి ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని ప్రత్యేక శుభ స్థానంలో ఉంటే జీవితం మొత్తం డబ్బుకు, ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. అదే అశుభ స్థానంలో ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. శని గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో ఉంది. అయితే ఈ 2024 సంవత్సరంలో మొత్తం మూడు సార్లు గమనంలో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా శని గ్రహ గమనంలో ఫిబ్రవరి 11న,  మార్చి 18న పెద్ద కదిలికలు రాబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్రమైన ప్రభావం పడబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ఎఫెక్ట్‌ పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి:
శని సాడే సతి కారణంగా ఫిబ్రవరి నెల  కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో మరిన్ని కష్టాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విజయాలు సాధించాలనుకునేవారికి ఈ నెల చాలా కష్టంగా ఉంటుంది. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు తల్లి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పనుల్లో తీవ్ర అడ్డంకులు తలెత్తే ఛాన్స్‌ కూడా ఉంది.

మకర రాశి:
మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో అనేక సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం మీరు శని అర్ధరాశిలో కూడా ఉండబోతున్నారు. కాబట్టి ప్రతి రంగంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో చాలా అనారోగ్య సమస్యలు పెరిగి ఆసుపత్రికి వెళ్లవల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు అనుకున్నదాని కంటే ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని పొందలేకపోవచ్చు. మకర రాశి వారికి ఆర్థిక స్థితిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

మీన రాశి:
మీన రాశి వారికి శని ప్రత్యేక ప్రభావం కారణంగా ఫిబ్రవరి నెలలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమయంలో వైవాహిక జీవితంలో తీవ్ర హెచ్చుతగ్గులు వస్తాయి. అంతేకాకుండా మీ తండ్రితో మీ సంబంధం ఈ సమయంలో మరింత క్షీణించవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన తీవ్ర ఇబ్బందుల బారిన పడతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఇక వృత్తి జీవితం గడుపుతున్నవారు తీవ్ర అడ్డంకులు ఎదుర్కొనే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News