Sun Transit Bad Effect 2024: గ్రహాలకు రాజు అయిన సూర్యుడు జనవరి 15వ తేదీన మకర రాశిలోకి సంచారం చేశారు. అయితే ఈ సంచారం కారణంగా ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారిపై పడింది. ఈ ప్రభావం జాతకంలో శుభస్థానంలో ఉంటే వ్యక్తిగత జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అదే ఈ రాశి అశుభ స్థానంలో ఉంటే కష్టాలు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడబోతుందని తెలుస్తోంది. ప్రతికూల ప్రభావం కారణంగా జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సూర్య గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్యారాశి:
సూర్య గ్రహ సంచారం కారణంగా కన్యా రాశి వారి జీవితాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆర్థికంగా వీరు కొంతవరకు నష్టపోతారు. దీంతోపాటు మీ భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి అలాగే అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి సూర్య గ్రహ సంచారం కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది.. కానీ చిన్న చిన్న సమస్యలు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మకర రాశి:
సూర్యగ్రహ సంచార ప్రతికూల ప్రభావం మకర రాశి వారిపై కూడా పడబోతున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.. మితిమీరిన ఖర్చు కారణంగా ప్రశాంతత తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter