Mercury Transit: రాబోయే 2 రోజుల్లో ఈ రాశులవారు 100 శాతం ఊహించని లాభాలు పొందుతారు!

Mercury Transit Sagittarius: బుధుడి సంచారం కారణంగా రాబోయే రెండు రోజుల్లో కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయి. కాబట్టి కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు మరికొన్ని రాశులవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 11:46 AM IST
 Mercury Transit: రాబోయే 2 రోజుల్లో ఈ రాశులవారు 100 శాతం ఊహించని లాభాలు పొందుతారు!

Mercury Transit Sagittarius: బుధుడు కార్తీక శుక్ల పక్ష చతుర్దశి 26 నవంబర్, ఆదివారం రాత్రి 9:10 గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం వృశ్చిక రాశిని వదిలి ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సమయంలో బుధ గ్రహ సంచార ప్రభావం పలు రాశుల వారి వ్యక్తిగత జీవితాలపై పడే అవకాశాలున్నాయి. డిసెంబర్ 12వ తేదీన తిరోగమనం కూడా చేయబోతోంది. ఆ తర్వాత జనవరి ఒకటి వరకు ధనస్సు రాశిలోని తిరోగమన దశలో ఉండబోతోంది. దీని కారణంగా జనవరి 1 వరకు కొన్ని రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడే ఛాన్స్ లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గ్రహం మళ్లీ డిసెంబర్ 28 తేదీన వృశ్చిక రాశిలోకే సంచారం చేయనుంది. అయితే దీని కారణంగా ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో.. బుధ గ్రహ సంచారం కారణంగా లాభాలు పొందబోయే రాశుల వారు లాభాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారికి బుధ గ్రహ సంచారం కారణంగా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా సోదరీ సోదరుల సపోర్టు లభించే ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతోపాటు అయితే వీరికి కొన్ని చిన్న చిన్న పనుల్లో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహ సంచారం కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి జీవితం గడుపుతున్న వారికి చిన్నచిన్న ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ఇక రాజకీయ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి బుధ గ్రహ సంచారం కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా కుటుంబం పరంగా కొన్ని కొత్త బాధ్యతలు పొందుతారు. అయితే ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పొట్టతో పాటు ఒత్తిడి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక పిల్లల విషయానికొస్తే చదువులో అనేక రకాల ఆటంకాలు ఏర్పడవచ్చు.

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

మిధున రాశి:
బుధ గ్రహ సంచారంతో మిధున రాశి వారికి అనేక రకాల వయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వీరిలో ధైర్యం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఎప్పటినుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడి ప్రేమగా ఉంటారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీరు వాహనాలతో పాటు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ బుద్ధుడి సంచారం కారణంగా కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీరికి ఆదాయం కూడా పెరుగుతాయి. అంతేకాకుండా వీరు దూర ప్రయాణాలు కోసం ఖర్చులు చేయోచ్చు. ఈ సమయంలో కొన్ని పనుల కారణంగా ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. తొబుట్టువులు, స్నేహితుల విషయంలో ఉద్రిక్తలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News