Mercury Retrograde in Leo: కొన్ని గ్రహాలు సమయాన్ని బట్టి రాశి సంచారాలు చేస్తాయి. ఈ గ్రహాలు సంచారాల ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి శుభ సమయాలు ఏర్పడితే..మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆగస్టు 24న బుధ గ్రహం సింహరాశిలో తిరోగమనం చేయబోతోంది. సెప్టెంబర్ 16 వరకు బుధ గ్రహం అదే స్థానంలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రావులవారికి లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏయే రాశులవారిపై ఈ తిరోమన ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై బుధుడి ప్రభావం:
మేషరాశి:
సింహరాశిలో బుధ గ్రహం తిరోగమనం చేయడం వల్ల మేషరాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంచార క్రమంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జీవితంలో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
వృషభ రాశి:
ఈ బుధుడి సంచారం కారణంగా వృషభ రాశి వారు కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఏర్పడుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి:
బుధ గ్రహం తిరోగమన ప్రత్యేక ప్రభావం సింహ రాశి రాశివారిపై కూడా పడుతుంది. వీరికి ఈ సమయంలో తీవ్ర ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి