Diwali Horoscope: 500 ఏళ్ల తర్వాత దీపావళి రోజు అద్భుతమైన యాదృచ్ఛికం..ఈ రాశుల వారు ఏం చేసినా డబ్బులు పొందుతారు..

Diwali Horoscope: 500 ఏళ్ల క్రితం ఏర్పడిన రాజయోగాలు ఈరోజు మళ్లీ ఏర్పడబోతున్నాయి దీనికి కారణంగా దీపావళి పండుగ కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2023, 02:27 PM IST
Diwali Horoscope: 500 ఏళ్ల తర్వాత దీపావళి రోజు అద్భుతమైన యాదృచ్ఛికం..ఈ రాశుల వారు ఏం చేసినా డబ్బులు పొందుతారు..

Diwali Horoscope: ఈ సంవత్సరం వచ్చిన దీపావళి పండగ చాలా పవిత్రమైనది దాదాపు 500 ఏళ్ల క్రితం దీపావళి పండగ రోజున ఐదు రాజయోగాలు ఏర్పడ్డాయి. మళ్లీ ఆ తర్వాత నవంబర్ 12 ఈ రోజున అవే రాజయోగాల అద్భుతమైన యాదృచ్ఛికం జరిగింది. గ్రహాల స్థానాల్లో మార్పులు చేర్పులు జరగడం వల్ల ఈ రాజయోగాలు ఏర్పడ్డాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఈరోజు గజకేసరి యోగం, సౌభాగ్య యోగం, ఆయుష్మాన్ యోగం, బుద్ధాదిత్య రాజయోగం, శష మహాపురుష రాజయోగాలు ఏర్పడతాయి. 

శుక్ర, శని, చంద్ర, గురు, బుధ గ్రహాల స్థానాల మార్పుల కారణంగా దీవాలి రోజు ఈ రాజయోగాలు ఏర్పడ్డాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రాజయోగాల కారణంగా దీపావళి నుంచి కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. ఏ రాశుల వారి జీవితాలు ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
ఈ సంవత్సరం దీపావళి మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ రాజయోగాల కారణంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి కొత్త ఆదాయం మార్గాలు ఏర్పడతాయి అంతేకాకుండా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ రోజు సరైన సమయమని చెప్పొచ్చు. మేష రాశి వారికి డబ్బు ఆరోగ్యపరంగా ఈ రాజయోగాల కారణంగా ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది కాబట్టి ఎలాంటి పనులు చేసినా జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ధనుస్సు రాశి:
దీపావళి పండగ ధనస్సు రాశి వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఐదు రాజయోగాల కారణంగా ధనస్సు రాశి వారు ఇంతకుముందు ఎప్పుడు వినలేని శుభవార్తలు కూడా వినబోతున్నారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు పెరగడం కారణంగా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేసే వారికి ఈరోజు చాలా శుభ్రమైనది.

మిథున రాశి :
మిథున రాశి వారికి ఈ దీపావళి పండగ లాభాలను తీసుకురాబోతోంది. గ్రహ స్థితులలో మార్పుల కారణంగా ఏర్పడిన రాజయోగాల ప్రభావం ఈ రాశి వారికి ఫలప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వీరు స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి అదృష్టం రెట్టింపు అవ్వడం కారణంగా ప్రమోషన్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా జీతాలలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో రెట్టింపు లాభాలను పొందుతారు. దీంతోపాటు ఈ యోగాల కారణంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా గొప్ప ఉపశమనం పొందుతారు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News