Dvaraka Mistery: వ్యాసుడు రచించిన మహాభారత గ్రంథంలో ద్వారకా నగరం ద్వారావతిగా పేర్కొనబడింది. అనాటి కాలంలో ద్వారకా యాదవులకు రాజధాని. ఈ నగరం గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరంలో ఉంది. మహాభారతం ప్రకారం, ఈ ద్వారకా నగరం (Dwarka) కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత సముద్రంలో మునిగిపోయింది. మగధ రాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను రక్షించడానికి కుశస్థలి అనే ప్రాంతంలో శ్రీకృష్ణుడు (Lord Krishn) ఈ ద్వారకా నగరాన్ని నిర్మించారు.
పరిశోధనల్లో ఏం వెల్లడైంది?
నీట మునిగిన ఈ నగరం ఎక్కడ ఉందనే విషయంపై చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిని నిర్ధారించడానికి పూణెలోని దక్కన్ కళాశాల, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ద్వారకా, దానికి ఉత్తరాన ఉన్న బెట్ ద్వారక అనే ద్వీపం వద్ద అనేక సంవత్సరాలుగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న నిర్మాణాల కింద దేవాలయాల అవశేషాలున్నట్లు వారు నిర్ధారించారు. అయితే అవి ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయినట్లు తెలిపారు.
పాత నిర్మాణాలను కనుగొనడానికి, ప్రస్తుతం నీటి అడుగున అన్వేషణ కొనసాగుతోంది. డైవర్లు బెట్ ద్వారక తీరంలో నాలుగు నుంచి 12 మీటర్ల లోతులో గోడలు, స్తంభాలు, రాతి బిల్డింగ్ బ్లాక్లు, మట్టి పాత్రలను కనుగొన్నారు. మూడు రంధ్రాలు ఉన్న రాతి యాంకర్‌లు కూడా కనుగొనబడ్డాయి. ఈ దొరికిన అనవాళ్లు ప్రకారం చూస్తే.. అయితే ఇది అనాడు ఓడరేవు నగరంగా ఉండేదని తెలుస్తోంది. త్రవ్వకాల్లో ప్రస్తుత ద్వారక కింద ఏడు పురాతన నివాసాలు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
ఈ పురాతన నగరం క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలో ఉండేదని... సముద్ర మట్టాలు పెరగడం వల్ల అది మునిగిపోయి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తవ్వకాల్లో లభించిన వస్తువులను గుర్తించే పని ఇంకా కొనసాగుతోంది. అంచనా వేసిన టైమ్‌లైన్‌లు ధృవీకరించబడితే, మహాభారతం ఎప్పుడు జరిగిందో మనకు తెలుస్తోంది. దీంతో మహాభారతంలో పేర్కొన్న ద్వారకా నగరం ఉనికి కూడా తెలుస్తోంది.
Also Read: Dream Astrology: కలలో వినాయకుడు కనిపిస్తే.. ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook