Ashubh yog: ఆగస్టులో 2 డేంజరస్ యోగాలు.. ఈ నెల మెుత్తం వీరి జీవితం అల్లకల్లోలమే.. మీ రాశి ఉందా?

Grah Gochar 2023: ఈ నెలలో సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రేశించనున్నాడు. దీని వల్ల రెండు అశుభకరమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి కొన్ని రాశులవారి జీవితంలో అల్లకల్లోలం సృష్టించనున్నాయి. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2023, 07:15 AM IST
Ashubh yog: ఆగస్టులో 2 డేంజరస్ యోగాలు.. ఈ నెల మెుత్తం వీరి జీవితం అల్లకల్లోలమే.. మీ రాశి ఉందా?

Ashubh yog in August 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. వీటి సంచార సమయంలో కొన్ని శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. పైగా ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. ఇది సుమారు రెండు నెలలపాటు ఉండనుంది. ఈ పవిత్రమైన మాసం ఆగస్టు 30న ముగుస్తుంది. ఆగస్టులో సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా అశుభకరమైన రెండు యోగాలు ఏర్పడుతున్నాయి. అవే దరిద్ర యోగం, ఖప్పర్ యోగం. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్యా రాశి
సూర్యుడు చేస్తున్న అశుభ కరమైన యోగాలు కన్యారాశి వారిపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. మీ కుటుంబ సభ్యులపై ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండండి. ఎందులోనైనా డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి చేయండి.  మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే మంచి డైట్ ఫాలో అవ్వండి. 
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి దరిద్ర యోగం అస్సలు కలిసి రాదు. ఈ యోగ సమయంలో మీ జీవితంలో అనుకోని సంఘటలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పని లేదా వ్యాపారం లేదా శుభకార్యం చేయడం మానుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
మిధునరాశి
దరిద్ర యోగం మిథున రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ సమంయలో మీరు హెల్త్ పై కేర్ తీసుకుంటే మంచిది. మీరు కెరీర్ అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం అంతగా అనుకూలంగా ఉండదు. ఫ్యామిలీలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Surya in Ashlesha Nakshatra: ఆశ్లేష నక్షత్రంలో సూర్యుని సంచారం..ఈ రాశులవారికి డబ్బే..డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News