Astrology Daan tips: జ్యోతిష్యశాస్త్రంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. సంపాదనలో కొద్దిభాగం దానాలకు కేటాయించాలనేది జ్యోతిష్య పండితులు చెప్పేమాట. అదే సమయంలో దానాలకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.
ఇంట్లో సుఖశాంతుల కోసం అందరూ కష్టపడతారు. రేయింబవళ్లు శ్రమిస్తారు. కుటుంబసభ్యుల్ని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. లక్ష్మీదేవి కరుణతో అన్ని కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షిస్తారు. జ్యోతిష్యం ప్రకారం సంపాదనలో కొద్దిభాగం దానాలకు కేటాయించాలని కూడా ఉంది. దానధర్మాలు చేయడం వల్ల అన్ని రకాల ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. అదే సమయంలో దానధర్మాలకు కొన్ని నియమాలున్నాయి. అవి తప్పకుండా పాటించాలి.
జ్యోతిష్య పండితులు చెప్పిందాని ప్రకారం ఎవరికైనా ఏదైనా దానం చేయాలనుకుంటే..స్వయంగా వెళ్లి ఇవ్వడం మంచిది. ఇంటికి పిలిపించుకుని ఇస్తే దానధర్మాల పూర్తి ఫలితం దక్కదు. లక్ష్మీదేవి కటాక్షం కోసం పూర్తి విధి విధానాలతో లక్ష్మీదేవి వద్ద నేయితో వెలిగించిన దీపం పెట్టాలి. ప్రతిరోజూ సాయంత్రం లక్ష్మీదేవి లేదా తులసీ దేవి వద్ద నేయితో వెలిగించిన మట్టిదీపం పెడితే..లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది. కష్టాల్ని దూరం చేస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి తన సంపాదనలో పదవభాగం దానాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఏదైనా మంచి కార్యాలకు ఈ డబ్బు ఖర్చు చేయాలి. మరోవైపు దానధర్మాలు చేసేటప్పుడు ఆనందంతో, స్వచ్ఛమైన మనస్సుతో చేయాలి. స్వచ్ఛమైన మనస్సుతో చేసే దానం వల్ల ఆ వ్యక్తి భాగ్యం వికసిస్తుంది. మరోవైపు నువ్వులు, నీరు, బియ్యం దానం చేసే వస్తువులు. పితృలకు నవ్వులు, దేవతలకు బియ్యం దానం చేయడం మంచిది.
Also read: Astro Hints: వృషభరాశిలో శుక్రుడు, జూన్ 18 ఉదయం నుంచి మారిపోతున్న ఆ నాలుగు రాశుల జాతకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook