Astrology: ఈ నెలలో ఒకే రాశిలో 4 గ్రహాల మహా సంయోగం.. ఈ 3 రాశుల వారికి వరం..

April 2024 Rashi Phalalu: ఈ హిందూ నూతన సంవత్సరంలో మీన రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఈ పవిత్రమైన యోగం వల్ల మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 9, 2024, 09:43 PM IST
Astrology: ఈ నెలలో ఒకే రాశిలో 4 గ్రహాల మహా సంయోగం.. ఈ 3 రాశుల వారికి వరం..

Chaturgrhai Yog In Meen Rashi 2024: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. ఏప్రిల్ లో కూడా కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఈ నెలలో శుక్రుడు, బుధుడు, కుజుడు మరియు రాహువు మీన రాశిలో కలవబోతున్నారు. మీన రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 25 వరకు ఉంటుంది. రెండున్నర రోజులపాటు ఉండే ఈ చతుర్గ్రాహి యోగం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా ధనస్సు రాశి వారు సంపద అనేక రెట్లు పెరుగుతుంది. మీరు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రేమికులు మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడు. మీకు లక్ కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి
మీనరాశిలో ఏర్పడబోతున్న చతుర్గ్రాహి యోగం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు చేరుకుంటారు. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ డ్రీమ్ అన్నీ నెరవేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ సాధిస్తారు. మీకు సామాజిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. 
మిధునరాశి
మిథునరాశి యెుక్క కర్మ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఊహించని లాభాలను పొందుతారు. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. 

Also Read: Ugadi Rashi Phalalu: ఉగాది నాడు అరుదైన యోగం.. రేపటి నుంచి ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

Also Read: Ugadi Panchangam: క్రోధీ నామ సంవత్సరంలో మేషం నుంచి కన్య వరకు ఏ రాశికి ఎక్కువ లక్కీ అంటే.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News