Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..

Narendra Modi Completes@10Years as PM: నరేంద్ర మోదీ భారత దేశంలో ఈయన పేరు ఎత్తని రాజకీయ పార్టీ కానీ నాయకులు లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా దూకుడు. ప్రధాన మంత్రిగా భారతీయ రాజకీయాలపై చెరగని ముద్ర వేసారు. మే 26తో ప్రధానిగా 10 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్నారు.

1 /13

తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల తర్వాత 10 యేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు.

2 /13

2014 మే 26న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా నరేంద్ర మోదీతో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.  

3 /13

2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ  

4 /13

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభ పోటీ చేసి గెలిచారు.

5 /13

2001లో కేశుభాయ్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2002లో జరిగిన గోద్రా అల్లర్లు నరేంద్ర మోదీకి పెద్ద పరీక్షపెట్టాయనే చెప్పాలి.

6 /13

ఆ తర్వాత 2002, 2007, 2012లో వరుసగా మూడు సార్లు బీజేపీని గుజరాత్‌లో అధికారంలోకి తీసుకొచ్చారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాల్గు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు కూడా మోదీ సొంతం.

7 /13

2014 ఎన్నికల్లో తొలిసారి వారణాసి, వడోదర నుంచి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో వారణాసి లోక్ సభ స్థానాన్నిఉంచుకొని.. వడోదరకు రాజీనామా చేసారు.

8 /13

2019లో కూడా వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక 2024లో మూడోసారి అదే స్థానం నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ తరుపున బరిలో దిగారు.

9 /13

మన దేశం నుంచి బతికి ఉండగానే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన తొలి రాజకీయ నేతగా గుర్తింపు పొందారు.

10 /13

అంతేకాదు తన హయాంలో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్, CAA వంటి ఎవరు టచ్ చేయడానికి భయపడే వాటిని చట్టాలుగా చేసిన ఘతన మోదీ ప్రభుత్వానికి దక్కుతోంది.

11 /13

జన్ ధన్ యోజన, స్వచ్ఛ్ భారత్, ప్రపంచ యోగా దినోత్సవం ఆయుష్మాన్ భారత్, వందేభారత్,దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి ఎన్నో ప్రజా ఉపయోగ పనులతో ప్రజల గుండెల్లో నిలిచారు.

12 /13

విదేశీ నాయకులతో సత్సంబంధాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. అంతేకాదు విశ్వనేతగా ఎదిగారు.  

13 /13

ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ  పీఎం అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా  రికార్డులకు ఎక్కనున్నారు.