Chandra Grahanam 2022: చంద్రగ్రహణం సమీపిస్తోంది. 2022 తొలి చంద్రగ్రహణం మే 16న ఏర్పడనుంది. చంద్రగ్రహణం నాడు ఆ మాడు రాశులకు మంచిది కాదంటున్నారు పండితులు. కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటున్నారు..
2022 మే 16న ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో చంద్ర గ్రహణానికి కీలక ప్రాధాన్యత ఉంది. చంద్ర గ్రహణం జ్యోతిష్య శాస్త్రంలో అశుభంగా భావిస్తారు. చంద్ర గ్రహణం సందర్భంగా చంద్రుడు పీడితుడవుతాడని జ్యోతిష్యం చెబుతోంది. చంద్ర గ్రహణ ప్రభావ మనిషిపై అత్యధికంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనసుకి కారకుడిగా భావిస్తారు. చంద్రుడి ఘటనలు పెరిగే పరిస్థితి మనిషిపై పెను ప్రభావాన్నే చూపిస్తుంది. అన్ని వస్తువులు చంద్రుడి ఆధీనంలో ఉంటాయంటారు. అంతేకాకుండా చంద్రుడిని పశ్చిమ దిశకు అధిపతిగా చెబుతారు. దాంతోపాటు చంద్రుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థాయిలోనూ..వృశ్చికంలో దిగువ స్థాయిలోనూ ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈసారి చంద్రగ్రహణం వృశ్చిక రాశిలో రానుంది. అందుకే కొన్ని రాశులవారికి ఈ చంద్రగ్రహణం అస్సలు మంచిది కాదంటున్నారు.
వృషభరాశి
చంద్రగ్రహణం తరువాత మీ జీవితంలో కాస్త ఎగుడుదిగుడులు ఎదురుకావచ్చు. వ్యాపారం, కెరీర్ పరంగా కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. డబ్బుల విషయంలో ఆశించిన లాభాలుండవు. ఆరోగ్యంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. ముందు నుంచే అనారోగ్యంగా ఉంటే..విషమం కాకుండా చూసుకోవల్సి వస్తుంది.
కన్యారాశి
సమీప కుటుంబ సభ్యులు కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అక్కా చెల్లెళ్లతో సంబంధాలు బాగుండేట్టు చూసుకోవాలి. డబ్బులకు సంబంధించిన అన్ని విషయాల్లో నెగెటివ్ పరిణామాలు కన్పిస్తాయి. ఇది మీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మానసిక సంఘర్షణ, అనవసరమైన భయయాలు ఎక్కువవుతాయి. ఆత్మ విశ్వాసం లోపిస్తుంది. ధైర్యంగా, సంయమనంగా ఉండాల్సిన అవసరముంది.
వృశ్చిక రాశి
చంద్రగ్రహం ఈ రాశిలోనే ఏర్పడనుంది. అందుకే ఈ రాశివారు ఎక్కువగా దుష్ప్రభావానికి గురవుతారు. ఈ నేపధ్యంలో కొన్ని రకాల కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ లాభాలపై చెడు ప్రభావం కన్పిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలగవచ్చు. నియమ నిబంధనలు పాటించనివారు స్వార్ధం కోసం ఎందాకైనా తెగిస్తారు. అటువంటివారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా అవసరం.
చంద్రగ్రహణం ఉపాయాలు
ఈసారి చంద్రగ్రహణం మే 16వ తేదీన వస్తోంది. ఆ రోజు సోమవారం. సోమవారమంటే శివునికి ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు భోళానాధుని పూజించి..తెల్లటి వస్తువులు దానం చేస్తే చంద్రగ్రహణం ద్వారా ఎదురయ్యే నెగెటివ్ ప్రభావాల్నించి కాపాడుకోవచ్చు.
Also read: Maa Lakshmi Blessings: మే 12న లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటే ఏడాదంతా డబ్బులే..డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.