Chandra Grahan 2022: చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సూతక్ కాలం ఉంటుందా?

Chandra Grahan 2022: ఈ ఏడాది మొదటి గ్రహణం ఏప్రిల్ 30న సంభవించింది. ఇక చంద్రగ్రహణం అయిన రెండో గ్రహణం మే 16న ఏర్పడనుంది. చంద్రగ్రహణ సమయం మరియు సూతక సమయాన్ని తెలుసుకోండి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 10:35 AM IST
Chandra Grahan 2022: చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సూతక్ కాలం ఉంటుందా?

Chandra Grahan 2022 Sutak Time: ఈ సంవత్సరం మొదటి గ్రహణమైన సూర్యగ్రహణం 2022 ఏప్రిల్ 30న ఏర్పడింది. విక్రమ్ సంవత్ 2079 కింద 4 గ్రహణాలు ఉంటాయి, అందులో 2 సూర్య గ్రహణాలు మరియు 2 చంద్ర గ్రహణాలు ఉంటాయి. ఇందులో ఏప్రిల్ 30న ఒక సూర్యగ్రహణం, మే 16న రెండో గ్రహణమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణాలలో అన్ని రకాల పరిహారాలు, సూతకం, స్నానం మరియు దానధర్మాలు చేయవలసి ఉంటుంది. ఈ ఏడాది ఏర్పడిన సూర్యగ్రహణం ప్రభావం మనదేశంపై అంతగా లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏర్పడబోయే చంద్రగ్రహణం (Chandra Grahan 2022) ప్రభావం కూడా భారతదేశంపై అంతగా ఉండదు.

ఎక్కడెక్కడ కనిపిస్తుంది
తొలి చంద్రగ్రహణం మే 16, 2022  వైశాఖ శుక్ల పూర్ణిమ రోజు సోమవారం నాడు ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా మరియు ఆసియా, ఈజిప్ట్, హంగేరి, గ్రీస్, హవాయి దీవులలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణం 7:58కి మెుదలవుతుంది. ఇది మనదేశంలో కనిపించక పోవడం వల్ల సూతక్ కాలం (Chandra Grahan Sutak Kaal) కూడా చెల్లదు. అదే విధంగా వేద, సూతకం, స్నాన, దాన, మంత్రోచ్ఛారణలు కర్మకాండలు కూడా చెల్లవు. 

రాహు కేతువులు ఎలా అవుతారు?
క్షీరసాగర మథనం సమయంలో దేవతలకు రాక్షసులు సహాయం అవసరమైంది. అందుకు సముద్రంలోంచి వెలువడే అమృతాన్ని రాక్షసులకు కూడా అందజేస్తామని చెప్పారు. చివరికి అమృతం బయటకు రాగానే దేవతలను ఒక వరుసలో, రాక్షసులను మరో వరుసలో ఉంచారు. రాక్షసులకు అమృతం తినిపించిన వెంటనే వారు అమరులవుతారని, అప్పుడు చాలా విధ్వంసం సృష్టిస్తారని దేవతలకు తెలుసు.అందుచేత విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి చిరునవ్వుతో దేవతలకు అమృతాన్ని పోయడం ప్రారంభించాడు. అతను తన మనోహరమైన చిరునవ్వుతో రాక్షసులను కలవరపెట్టాడు. 

స్వరభానుడు రాక్షసుడు తనకు అమృతం రాదని తెలిసి దేవతల వరుసలో రహస్యంగా కూర్చున్నాడు. మోహినిగా అవతరించిన విష్ణువు స్వరభానుడి చెంబులో అమృతాన్ని పోసి, తన నోటితో కప్పును పెట్టి త్రాగడం ప్రారంభించాడు. అతడిని గుర్తించిన సూర్య, చంద్రులు వెంటనే విష్ణువుకు చెప్పారు. దీంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వరభానుడి మెడను శరీరం నుండి వేరుచేశాడు. అయితే అప్పటికే అతడి గొంతులోకి అమృతం వెళ్లింది. అందుకే అతడు అమరుడయ్యాడు. కానీ అతడు తల, మెుండెం వేరయ్యాయి. మెడ పై భాగం రాహువుగా, మొండెం కేతువుగా మారింది.  సూర్యుడు, చంద్రుడు స్వరభానుని గుర్తించారు కాబట్టి వారిపై రాహు కేతువు ప్రతీకారం తీర్చుకుంటాడు. అందుకే వారిద్దరికీ గ్రహణం పడుతుంది. 

Also Read: Surya Transit 2022: సూర్యుని సంచారం.. ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News