Chaitra Amavasya 2022: హిందూ మత సంప్రదాయం ప్రకారం.. నెలలో పౌర్ణమి, అమావాస్య తిథిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని.. అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. పితృ దోషం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతుందని జోతిష్య్కులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఆ దోషం కలిగిన పిల్లల సంతోషంలో కూడా అడ్డంకులు ఎదురవుతాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైత్య మాస అమావాస్య రోజున పితృ దోష, కాల సర్ప దోషాలను వదిలించుకోవడానికి చర్యలు తీసుకుంటే మేలు జరుగుతుంది.
చైత్ర అమావాస్య ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం.. చైత్ర అమావాస్య తిథి మార్చి 31 మధ్యాహ్నం 12.22 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 11:53 గంటలకు అమావాస్య తిథి ముగుస్తుంది. అయితే ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 9.37 గంటలకు బ్రహ్మయోగం ఉంది. ఆ తర్వాత ఇంద్రయోగ ఘడియలు వస్తాయి.
పితృదోష నివారణ చర్యలు
హిందూ మత సంప్రదాయాల ప్రకారం.. చైత్ర అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత.. దానధర్మాలు చేస్తారు. దగ్గర్లో నది లేకుంటే ఇంట్లోని గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి. పితృ దోషం బారిన పడిన వారు పూర్వీకుల కోసం తర్పణం, పిండదానం, దానధర్మాలు చేస్తారు. అదే విధంగా బ్రహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది. దీంతో పాటు ఆహారంతో కొంత భాగాన్ని కాకికి, ఆవుకి తినిపిస్తారు. ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
కాలసర్ప దోష నివారణ
కాల సర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాల సర్ప దోషం నుంచి బయటపడటానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తరువాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. త్రయంబకేశ్వర్, నాసిక్, ఉజ్జయిని, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాల్లో కాలసర్ప దోషాల నివారణ చర్యలు తీసుకోవచ్చు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారం జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని పాటించే ముందు జోతిష్య్కులను సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Today Horoscope March 24 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook