Budhaditya Yog 2022: ఇవాళ (జూలై 2) బుధ గ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తోంది. జూలై 17 వరకు మిథునంలోనే సంచరిస్తుంది. ఇప్పటికే సూర్యుడు మిథునంలో సంచరిస్తున్నాడు. జూన్ 15న మిథునంలోకి ప్రవేశించిన సూర్యుడు జూలై 16 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. మిథునంలో బుధ, సూర్య గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. బుధుడు, సూర్యుడు ఏ రాశిలో కలయిక చెందిన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా మేలు చేస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
సింహం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధాదిత్య యోగం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశి వారి జాతకంలో 11వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ ఇల్లు ఆదాయం, లాభానికి సూచిక. అందువల్ల బుధాదిత్య యోగం సమయంలో సింహ రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడుతాయి.
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఇది ఇల్లు ఉద్యోగం, ఉద్యోగానికి సంకేతం. తద్వారా.. బుధాదిత్య యోగం ఈ రాశి వారికి కొత్త జాబ్ ఆఫర్ తీసుకురావొచ్చు. ఇప్పటికే ఉద్యోగంలోఉన్న వ్యక్తులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందవచ్చు. వ్యాపారం పురోగతి చెందుతుంది. బుధుడు, సూర్యుని ప్రభావం పని శైలిని మెరుగుపరుస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో రూబీ స్టోన్ ధరించడం అదృష్టంగా చెబుతారు.
వృషభం : ఈ రోజు నుండి ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలయ్యాయి. వృషభ రాశి వారి జాతకంలో రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. బకాయి డబ్బులు వసూలవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అన్నివిధాలా కలిసొస్తుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కేసీఆర్ తో కలిసి సిన్హాకు కాంగ్రెస్ సీనియర్ నేత స్వాగతం
Also Read: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook