Budh Vakri 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం.. ఈ రాశులవారి సంచులు డబ్బుతో నిండటం ఖాయం!

Budh Vakri 2022: ఈ నెల 10న బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2022, 08:56 AM IST
Budh Vakri 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం.. ఈ రాశులవారి సంచులు డబ్బుతో నిండటం ఖాయం!

Budh Vakri 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తుంది. అయితే ఈ గ్రహాలు కొన్ని సార్లు సంచార మార్గంలో ఉంటే...మరికొన్ని సార్లు తిరోగమనంలో ఉంటాయి. ఈ నెల 10 తేదీ నుంచి మెర్య్కూరీ గ్రహం కన్యారాశిలో తిరోగమనం (Mercury retrograde in Virgo 2022) చేయబోతుంది. 2 అక్టోబర్ 2022 వరకు బుధుడు తిరోగమనంలోనే ఉంటాడు. ఈ తిరోగమన బుధుడు సంచారం కొన్ని రాశులవారికి అపారమైన డబ్బును, ఆనందాన్ని ఇస్తుంది. 

తిరోగమన బుధుడు సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిథునరాశి (Gemini)- బుధుని తిరోగమన సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఈరాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి లబ్ధి పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 

కన్య (Virgo)- బుధుడు కన్యారాశిలోనే తిరోగమనం చేయబోతున్నాడు. ఇది ఈ రాశివారికి కలిసి వస్తుంది. ఈరాశివారి కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో ఇమేజ్ పెరుగుతుంది.  

వృశ్చికం (Scorpio) - తిరోగమన బుధుడు వృశ్చిక రాశి వారికి భారీగా లాభాలను ఇస్తాడు. ఈ రాశివారికి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ సాధిస్తారు. వ్యాపారులు రాణిస్తారు. ఈరాశివారికి పదవి, డబ్బు, పలుకుబడి అన్నీ కలిసి వస్తాయి. 

ధనుస్సు (Sagittarius)- తిరోగమన బుధుడు సంచారం వల్ల ధనుస్సు రాశి వారి వృత్తి జీవితం బాగుంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ప్యూచర్ బాగుంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. 

మకరం (Capricorn)- బుధుడు తిరోగమనం చేయడం వల్ల మకర రాశి వారికి చాలా విషయాల్లో కలిసి వస్తుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Also Read: Kundali Doshalu: మీ కుండలిలో దోషముందా..ఇలా చేస్తే విముక్తి ఖాయం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News