Mercury Rise 2023 in Cancer: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఇవాళ అంటే జూలై 14న కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. ఇతడిని మేధస్సు, తర్కం, ప్రసంగం, సంభాషణ మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. సాధారణంగా గ్రహాల అస్తమయం చెడు ఫలితాలను ఇస్తే.. గ్రహాల ఉదయించడం మాత్రం శుభఫలితాలను ఇస్తుంది. బుధుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారు లాభాలు పొందుతారో తెలుసుకుందాం.
మేషరాశి: బుధుడు ఉదయించడం వల్ల మేషరాశి వారికి చాలా బెనిఫిట్స్ పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
కుంభం: కుంభ రాశి వారికి బుధుడు అనేక విషయాల్లో లాభాలను ఇస్తాడు. మీకు పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభాలు పొందుతారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ పరిస్థితి అదుపులో ఉంటుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది.
వృషభం: బుధ సంచారం వృషభ రాశి వారికి లాభదాయకం. మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారు. కొత్త జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు మంచి రాబడి వస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: Mangal Shukra Yuti 2023: చాలా ఏళ్ల తర్వాత కుజుడు-శుక్రుడు కలయిక.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..
కన్య: బుధుడు ఉదయం కన్యారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. విదేశాల నుండి లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: August Grah Gochar: ఆగష్టులో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశుల జీవితంలో పెను మార్పులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook