Budh Uday 2023: బుధుడి సంచారంతో ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే..

Budh Uday 2023: బుధుడి సంచారం కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రాశులవారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 13, 2023, 09:26 AM IST
Budh Uday 2023: బుధుడి సంచారంతో ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే..

 Budh Uday 2023: బుధుడు రాశి చక్రాల్లో అనుకూల స్థితిలో ఉంటే ఎలాంటి వ్యాపారాలు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ గ్రహం జాతకంలో ప్రతి కూలస్థానంలో ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు రోజువారి జీవితంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం  బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి బలమైన స్థితిలో ఉన్నాడు. ఈ ప్రక్రియ 11 జూలై  తేదిన జరిగింది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో కొన్ని రాశులవారు ఊహించని భారీ లాభాలు పొందే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ బుధుడి అనుకూల స్థితి ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కర్కాటకంలో బుధ సంచారంతో ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మిథునరాశి:

మిథున రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండబోతున్నాడు. దీని కారణంగా జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇంతక ముందు ఖర్చైన డబ్బు సులభంగా పొందుతారు. కష్టపడి పని చేయడం వల్ల ఆదాయం పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లభిస్తాయి. దీంతో పాటు జీతాలు కూడా పెరుగుతాయి. వీరు ఈ సంచారం కారణంగా ఆస్తి లేదా భూములను కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది.

Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం

కన్యారాశి:
బుధుడు శుభ స్థానంలోకి మారడం వల్ల కన్యారాశివారికి చాలా రకాల రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి వ్యాపారాల్లో చాలా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. అంతేకాకుండా వీరికి ఆత్మగౌరం పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

మకర రాశి:
బుధుడి సంచారం కారణంగా  మకర రాశి వారిపై సానుకూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్స్‌ కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరి ఆదాయం కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వివాహ విషయాలు కూడా పరిష్కారమవుతాయి. తీవ్ర ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News