Bhadra Raj Yoga January 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడి అని పిలుస్తారు. బుధుడు రేపు అంటే డిసెంబరు 31న ధనుస్సు రాశిలో తిరోగమనం చేయనున్నాడు. కొత్త ఏడాది ప్రారంభంలో అంటే జనవరి నెలలో బుధ గ్రహం అరుదైన భద్ర యోగాన్ని చేస్తున్నాడు. జనవరి 18, 2023న సాయంత్రం 6.18 గంటలకు బుధుడు ప్రత్యక్ష మార్గంలోకి రానున్నాడు. అనంతరం బుధుడు ఫిబ్రవరి 7న మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. భద్ర రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు అపారమైన లాభాలను ఆర్జించనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుుకందాం.
మేష రాశి (Aries): భద్ర రాజయోగం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మిథున రాశి (Gemini): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెళ్లికానీ యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది.
కన్యారాశి (Virgo): భద్ర రాజయోగం వల్ల కన్యారాశి వారికి అపారమైన ప్రయోజనం కలుగుతుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): బుధుడు చేస్తున్న రాజయోగం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులు భారీగా లాభపడతారు. వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణలు చేసే అవకాశం ఉంది.
Also Read: Surya-Shani Yog 2023: కుంభంలో శని-సూర్యుని కలయిక.. ఈ రాశుల వారిపై డబ్బు వర్షమే ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.