Mercury transit 2022: కన్యారాశిలో బుధ సంచారం... ఈ రాశుల వారికి ధనప్రాప్తి, కెరీర్ లో పురోగతి..

Mercury transit 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని శుభ గ్రహంగా భావిస్తారు. దీని శుభ ప్రభావం కొన్ని రాశులకు అపారమైన సంపదను తెస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2022, 09:20 AM IST
Mercury transit 2022: కన్యారాశిలో బుధ సంచారం... ఈ రాశుల వారికి ధనప్రాప్తి, కెరీర్ లో పురోగతి..

Budh Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధ గ్రహం ఆగస్టు 21న కన్యారాశిలోకి ప్రవేశించింది. అక్కడే అక్టోబర్ 26, 2022 వరకు (Mercury transit in Virgo 2022) సంచరించనుంది. ఈ సమయంలో బృహస్పతి దృష్టి వల్ల బుధుడి యెుక్క సానుకూలత పెరుగుతుంది. దీంతో కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం (Gemini) : ఈ బుధ సంచారం వల్ల మిధున రాశి వారు అనేక బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఈ రాశివారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆఫీసులో సహచరుల సహకారం మీకు లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. లక్ తో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం ఈ రాశివారికి కలిసి వస్తుంది. 

కర్కాటకం (Cancer): బుధుడి సంచారం కర్కాటక రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. కెరీర్‌కు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది. 

సింహం (Leo): ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. వీరు ఆస్తి ప్రయోజనం పొందవచ్చు. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంతక ముందు వదిలేసిన పని ఇప్పుడు పూర్తవుతుంది. పథకాల వల్ల ప్రయోజనం పొందుతారు. 

కన్య (Virgo): కన్యారాశిలో బుధుడు సంచారం వల్ల ఈ రాశివారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ప్రియమైన వారి నుండి శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.

Also Read: Venus Transit 2022: సింహరాశిలో శుక్ర సంచారం... 23 రోజులపాటు ఈ రాశులపై డబ్బు వర్షం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News