Best Time To Wear Gemstones: జ్యోతిష్య శాస్త్రంలో ముత్యాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. వీటిని చంద్రుడి మనస్సుకు కారకంగా పరిగణిస్తారు. ముత్యాలను ధరించడం వల్ల ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మనస్సు ప్రశాంతంగా కూడా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. జాతాకాల్లో మార్పుల కారణంగా చాలా మంది వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా భాగస్వామితో విబేధాలు ఏర్పడి తీవ్ర విడిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి ముత్యాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
తరచుగా కుటుంబ సభ్యులతో గొడవలు పడేవారు కూడా ఈ ముత్యాలను ధరించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వీటి ధరించేవారు ఎప్పుడు ప్రేమను కలిగి ఉంటారట. దీంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ముత్యాలను ధరించకూడని సమయాల్లో ధరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోయే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని ప్రత్యేక సమయాల్లో మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఆ ప్రత్యేక సమయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ముత్యాన్ని ఏ వేలికి ధరించాలో తెలుసా?:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మీరు ఏ చేతితో ఎక్కువ పని చేస్తారో..ఆ చేతి చిటికెన వేలికి ఈ ముత్యాన్ని ధరించవచ్చు. ప్రస్తుతం చాలా మంది ముత్యాలను బంగారు ఉంగరాలలో ధరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఖర్చులు ఎక్కువ అనుకునేవారు వెండి ఉంగరంతో కూడా ధరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దీనిని ధరించే క్రమంలో వేరే వేలికి నీలమణి రత్నం కలిగిన ఉంగరాలు ఉంటే తీసి వేయడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
తప్పకుండా ఈ విషయాలు గుర్తుంచుకోండి:
శుక్ల పక్షంలో మొదటి లేదా రెండవ సోమవారం రోజున ఈ ముత్యం ధరించడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున కూడా ధరించవచ్చు. ముత్యాన్ని ధరించే ముందు గంగాజలంలో లేదా పచ్చి ఆవు పాలలో 10 నిమిషాలు నానబెట్టాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టిన తర్వాత ధరించే క్రమంలో 108 సార్లు ఓం చంద్రాయ నమః అని జపించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి