Venus transit 2023: ఈ 5 రాశుల వారికి మహార్దశ.. అక్టోబరు 2 వరకు వీరు పట్టిందల్లా బంగారం..

Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. శుక్రుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవల శుక్రుడు అరుదైన యోగాన్ని సృష్టించాడు. దీంతో 5 రాశులవారు లాభపడనున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2023, 06:42 AM IST
Venus transit 2023: ఈ 5 రాశుల వారికి మహార్దశ.. అక్టోబరు 2 వరకు వీరు పట్టిందల్లా బంగారం..

Venus transit in cancer 2023: అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైన మరియు వేడి గ్రహంగా శుక్రుడిని పిలుస్తారు. శుక్రుడు, భూమి గ్రహాలను సోదర గ్రహాలు అని అంటారు. పురాణాల ప్రకారం, శుక్రుడు అంటే రాక్షసుల గురవైన శుక్రచార్యుడు అని అర్థం. అంతేకాకుండా ఇతడిని లవ్, డబ్బు, ఆనందానికి కారకుడిగా భావిస్తారు. ఆగస్ట్ 7, 2023న, శుక్రుడు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా అరుదైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభప్రదమైన యోగం వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. అక్టోబరు 02 వరకు ఈ రాశులకు తిరుగుండదు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటకం- ఇదే రాశిలో శుక్రుని సంచారం జరిగింది. శుక్రుడు సృష్టించిన గజలక్ష్మీ రాజయోగం వీరికి అపారమైన సంపదను ఇస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 
మిథునరాశి- గజలక్ష్మి రాజయోగం మిథునరాశి వారికి మేలు చేస్తుంది. మీ భారీగా డబ్బును సంపాదించడంతోపాటు పొదుపు కూడా చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలను ఆర్జిస్తారు. 
మకర రాశి- గజలక్ష్మీ రాజయోగం వల్ల మకర రాశి వారి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. మీ జీవితం ఆనందమయం అవుతుంది. 

Also Read: Sun Transit 2023: ఈ నెల 17 నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి!

కన్యారాశి - శుక్రుని రాశి మార్పు కన్యారాశి వారికి కలిసి వస్తుంది. వీరు పురోభివృద్ధి సాధిస్తారు. సంపద పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు మెుదలవుతాయి. వ్యాపారులు భారీగా లాభపడతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు. 
తుల రాశి - శుక్రుని సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు లాభపడతారు. మీకు పదవి దక్కుతుంది. అంతేకాకుండా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Lucky Gemstones: ఈ రత్నాలు ధరిస్తే ఇక మీరు రారాజులే, ఎవరు ఏ రత్నం ధరించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News